మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన ఆచార్య అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. గాడ్ ఫాదర్ సినిమా నష్టాలను తెచ్చిపెట్టింది. అంతకు ముందు చేసిన సైరా కూడా భారీ నష్టాలను తెచ్చి పెట్టింది అనే చెప్పాలి. అలా చిరంజీవికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడకపోవడంతో భారీ అంచనాలతో వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్..ఈయనకు తోడుగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు. దీంతో మెగా మాస్ పక్కా అంటూ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వాల్తేరు వీరయ్య అయినా కూడా చిరు స్థాయి హిట్ సాధించిందా? లేదా? అన్నది చూద్దాం
కథ:
జాలారి పేటలో వాల్తేరు వీరయ్య నివసిస్తుంటాడు. అతనికి తెలియకుండా కొందరు సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ డ్రగ్స్ దందా చేసే వారిని అరెస్ట్ చేస్తాడు. వారిని కాపాడుకునే ప్రయత్నంలో వీరయ్యని కూడా పట్టుకొని వెళతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరయ్య, విక్రమ్ లు ఒకే తండ్రి బిడ్డలు. తల్లులు మాత్రం వేరు. అయితే వీరయ్య జైల్లో ఉన్న సమయంలో విక్రమ్‌ని దుండగులు మట్టుపెడతారు. తమ్ముడిని చంపింది ప్రకాశ్ రాజ్ అని తెలుసుకొని మలేసియాలో ఉన్న ప్రకాశ్ రాజ్ దగ్గరకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్
వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్, రవితేజ ఇద్దరు కలిసి పూనకాలు తెప్పించారు. ఫస్టాఫ్ అంతా చిరు ఎంటర్‌టైన్‌మెంట్ తో ఆసక్తిగా నడిచింది. రవితేజ పాత్ర తక్కువే అయిన ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఇక శృతి హాసన్ సీబీఐ ఆఫీసర్‌గా అదరగొట్టింది. బాబీ సింహా, వెన్నెల కిషోర్ వారు వారు తమ పాత్రల మేర అద్భుతంగా నటించారు. ఇక సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం భళా అని చెప్పాలి. ప్రతి సాంగ్ స్క్రీన్ పై ఆకట్టుకుంటుంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ రూపొందించిన సెట్స్ , బాబీ తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు. సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తానికి సంక్రాంతికి మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…