Virupaksha Movie : విరూపాక్ష మూవీ ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

Virupaksha Movie : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘విరూపాక్ష ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి తేజ్ నటించిన తొలి సినిమా కావ‌డంతో ఈ మూవీపై ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తి చూపించారు. అయితే ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ కథ కాకుండా… మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించ‌డంతో సినిమా ఓ రేంజ్‌లో అప్లాజ్ అందుకుంది. థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందు సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్మేశారు.

‘విరూపాక్ష’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తమ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని థియేటర్లలో నిర్మాతలు తెలిపారు. ఎన్ని వారాలకు సినిమా ఓటీటీలో వస్తుంది? అనే దానిపై కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ‘విరూపాక్ష’ శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ నెట్వర్క్ ‘స్టార్ మా’ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందించారు.

Virupaksha Movie ott streaming know the details
Virupaksha Movie

విరూపాక్ష’ సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించ‌గా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. అమెరికా ప్రీమియర్స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ వరకు అన్ని ఏరియాల్లో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయవద్దని చిత్ర బృందం ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తూ వ‌స్తుంది. ‘విరూపాక్ష’ సినిమాలో సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్, సోనియా సింగ్, రవి కృష్ణ, అభినవ్ గోమఠం, యాంకర్ శ్యామల, కామాక్షీ భాస్కర్ల, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago