‘రాజావారు రాణిగారు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని దగ్గరైన హీరో కిరణ్ అబ్బవరం.ఆయన తాజాగా జీఏ 2 పిక్చర్స్ సంస్థలో ‘వినరో భాగ్యము విష్ణు కథ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే.. దర్శనా (కశ్మీరా పర్ధేశీ) యూట్యూబర్ కాగా, వ్యూస్ కోసం ఫోన్ నంబర్‌కు ఒక అంకె ముందు, వెనుక కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో ప్లాన్ చేస్తుంది. దర్శనా ఫోన్ నెంబర్ నైబర్స్ ఎవరంటే… ఒకరు, శర్మ (మురళీ శర్మ). ఇంకొకరు, విష్ణు (కిరణ్ అబ్బవరం). ఇలాంటి సమయంలో దర్శనతో విష్ణు ప్రేమలో పడతాడు. శర్మ కూడా దర్శనను ప్రేమిస్తాడు.
ఒక రోజు శర్మను షూట్ చేస్తుంది దర్శన. అతను మరణిస్తాడు. శర్మను దర్శనా చంపడానికి కారణం ఏంటి? విష్ణు కోసం ఎన్ఐఏ & రాయలసీమకు చెందిన ఓ మంత్రి ఎందుకు తిరుగుతున్నారు? శర్మ హత్య కేసులో జైలుకు వెళ్ళిన దర్శనను బయటకు తీసుకు రావడం కోసం విష్ణు ఎలాంటి పనులు చేశాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.యాక్టింగ్ విషయానికి వస్తే హీరో కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్లకు యాక్టింగ్ చేసేంత స్కోప్ లేదు. చిత్రంలో శుభలేఖ సుధాకర్, దేవి ప్రసాద్, అమని లాంటి అద్భుతమైన నటులు ఉన్నారు. కానీ డైరెక్టర్ వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.
టెక్నికల్ టీమ్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి.. ఆయన తన వరకు పూర్తి న్యాయం చేశాడు. ఉన్నంతలో విజువల్స్ నీ బాగా చూపించాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్, ఫైట్ సీన్స్ లో బాగా ఇచ్చాడనే చెప్పాలి.. పాటలు ఓకె. డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బురు స్టోరీ బాగానే అనుకున్న దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో చాలా తడబడ్డాడు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, నిడివి విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని వుండాల్సింది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకి కాస్త బోరింగ్ తెప్పిస్తుందనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…