Geeta Singh : ఈవీవీ సత్యనారాయణ సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది లేడి కమెడీయన్ గీతా సింగ్. కితకితలు సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా నటించి మెప్పించింది గీత. కితకితలు సినిమా తరువాత ఈవిడకి భారీగానే అవకాశాలు వచ్చాయి. అయితే రాను రాను ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల ద్వారా సంపాధించిన ఆస్తిని కొందరు వ్యక్తులని నమ్మి పోగొట్టుకున్నారు గీతాసింగ్. దాంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఆర్ధికంగా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చాలా కష్టాలలో ఉన్న గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది.
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతా సింగ్ దత్తత కుమారుడు మృతి చెందాడు. మరో నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కారులో అయినా, బైక్‌పై అయినా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కమెడియన్ గీతా సింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, ఓం శాంతి అంటూ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. నిజానికి గీతాసింగ్‌కు పెళ్లికాలేదు. తన అన్నయ్య ఇద్దరు పిల్లలను గీతాసింగ్ పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన ఇద్దరు కొడుకుల భారాన్ని గీతాసింగ్ తనపై వేసుకొని పెంచుతుంది.
అన్నయ్య ఇద్దరు పిల్లలతో పాటు తన కజిన్ కూతురిని కూడా సొంత పిల్లలుగా పెంచుకుంటున్నారు గీతా సింగ్ . అయితే, ఈరోజు గీతాసింగ్ పెద్ద కుమారుడు నలుగురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం. ఈ యాక్సిడెంట్‌లో గీతాసింగ్ కుమారుడు కన్నుమూశాడు. అయితే, ఆ కుమారుడు పేరేంటి, ప్రమాదం ఎక్కడ జరిగింది వంటి విషయాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు గీతాసింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…