Vimanam Teaser : స్టార్ యాంకర్ గా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం వెండితెరపై అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుస చిత్రాలతో బిగ్ స్క్రీన్ పై అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు ఇటు సోషల్ మీడియాలోనూ మత్తెక్కించేలా ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అదిరిపోయే ఫొటోషూట్లతో అనసూయ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న విషయం తెలిసిందే. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తూ అదరగొడుతోంది.
ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా ‘రంగమార్తాండ’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ‘విమానం’ సినిమాలో నటిస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2 ది రూల్’లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విమానం మూవీలో అనసూయ ప్రధాన పాత్ర పోషించగా, రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఓ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ. విమానం ఎక్కించమని తండ్రికి చెబితే.. బాగా చదివితే విమానం ఎక్కొచ్చు అని చెబుతాడు తండ్రి. మరీ ఆ పిల్లాడి ఆశ నెరవేరిందా? విమానం ఎక్కాడా? అనే కాన్సెప్ట్‌తో సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది.
చిత్రంలో అనసూయ చాలా బోల్డ్‌గా కనిపించనుందని అర్ధమవుతుంది. తన అందాలతో కుర్రాళ్లకి మత్తెక్కించేలా ఇందులో ఆమె పాత్ర ఉంటుందట. ఇప్పటికే అనసూయకి సంబంధించి కొన్ని పోస్టర్స్ కూడా విడుదల కాగా, అవి నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన సుమతి పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని రీసెంట్‌గా విడుదలైన సదరు పాత్ర ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది.ఇక ఈ సినిమాతో మీరా జాస్మిన్ రీఎంట్రీ ఇస్తుంది. మాస్టర్ ధృవన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధన్‌రాజ్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు. ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి కిరణ్ కొర్రపాటి సంయుక్తంగా నిర్మించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…