నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి పట్టుంది. అలాగే రూరల్ నియోజకవర్గంలోనూ కూడా కొంత బలముంది. ప్రస్తుతం ఆనం వెంకటరమణారెడ్డి ఈ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి, ఇక రూరల్ నియోజకవర్గంలోనూ అతనికి కాస్త బలం ఉండడంతో రెండింటిలో ఒక సీటు తనకు కావాలని ఆనం వెంకటరమణారెడ్డి కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు మొగ్గు చూపించాడనే టాక్ నడుస్తుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై.. టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి తాజాగాసంచలన ఆరోపణలు చేశారు. రోజా గురించి తాను నగరి నియోజకవర్గం మొత్తం ప్రజాభిప్రాయం సేకరించానని.. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో రోజా గెలవడం అసాధ్యం అని జోస్యం చెప్పారు. విజయపురం మండలం, పాతార్కాడు, కోసల నగరం గ్రామాల్లో దాదాపు వందల ఎకరాల భూమిని రోజా కబ్జా చేశారని కూడా ఆయన విమర్శలు చేశారు. మంత్రి రోజా పేరెత్తితే.. నగరి ప్రజలు చీదరించుకుంటున్నారని ఆనం స్పష్టం చేశారు. ఆఖరికి ఏడు కొండల వెంకటేశ్వర స్వామినే ప్రోటోకాల్ టికెట్ల రూపంలో అమ్ముకుంటుందని ఆమెపై ధ్వజమెత్తారు.
ఇటీవల లోకేష్ పాదయాత్రపై కూడా మంత్రి ఆర్కే సెటైర్లు వేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా ఉన్నా.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు నారా లోకేష్ సొంతమని ఆమె ఎద్దేవా చేయడంతో ఆనం రోజాని ఫుల్ గా టార్గెట్ చేశారు. లోకేశ్ ను పిత్రి, గిత్రి అంటే నీకు మామూలుగా ఉండదు అని హెచ్చరించారు.మా అన్నని ఆంబోతు అంటావా.. నువ్వు బుజ్జి పందిపిల్లవని నేను మనవి చేస్తున్నా. మాటకి మాటకి దెబ్బకి దెబ్బ వదిలేది లేదని మండిపడ్డారు. ఆనం సెటైరికల్ కామెంట్స్ కి వేదికపై ఉన్న వాళ్లందరు తెగ ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…