Shiva Reddy : శివారెడ్డి.. మనోడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగాను, మిమిక్రి ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. ఓ సందర్భంలో శివారెడ్డి మాట్లాడుతూ.. నేను నటుడిని కావడానికి మిమిక్రీ కారణమని అందుకే మిమిక్రీ అంటే నాకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. 1998 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు వరుసగా సినిమాలు చేసిని అతను… స్కూల్ లో చదువుకునే సమయంలోనే జంతువుల అరుపులను మిమిక్రీ చేసేవాడినని తొలిసారి సీనియర్ ఎన్టీఆర్ మాటలను మిమిక్రీ చేశానని తెలియజేశాడు. ఇక శివారెడ్డి తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో అన్నగారి వాయిస్‌ని మిమిక్రి చేయడమే కాకుండా ఆయనలా హావభావాలు చూపించి అందరి మెప్పు పొందారు.
బాలయ్య పక్కన ఉన్న సమయంలో శివారెడ్డి అన్నగారిలా మిమిక్రి చేయడం గొప్ప విషయమే. అయితే శివారెడ్డి మిమిక్రిని బాలయ్య మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. పిట్టలదొర మూవీ శివారెడ్డి తొలి మూవీ కాగా, ఆ తర్వాత పలు సినిమాలలో నటించాడు. ఇక ఎవరెవరి వాయిస్‌ని ఎలా ఇమిటేట్ చేయోచ్చు అనే దానిపై ఓ సారి స్పందించిన శివారెడ్డి.. నాగార్జున గారి వాయిస్ ను సులువుగా మిమిక్రీ చేయవచ్చని బాలయ్య, అమ్రీష్ పురి వాయిస్ లను మిమిక్రీ చేయడం సులువు కాదని శివారెడ్డి కామెంట్లు చేశారు. నా భార్య సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని శివారెడ్డి అన్నారు.
తనకు ఇద్దరు పిల్లలు అనిఆ ఇద్దరికీ మిమిక్రీ కళ వచ్చిందని శివారెడ్డి వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో సైతం వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిన ఎన్టీఆర్‌ని ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…