Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు ఉపాసన. ఆమె తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని. చిన్న వయసునుంచే వ్యాపార సామ్రాజ్య సంగతులను నేర్చుకున్నారు. పదిహేనేళ్ళ వయస్సులోనే “యు ఎక్సేంజ్” సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి.. పేద పిల్లలకు అందించే వారు ఉపానసన. అంతేకాదు మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స అందించి మంచి మనసు చాటుకుంది.
పాతికేళ్లకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకొని అందరిని ఆశ్చర్యపరచింది ఉపాసన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్ లలో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటుంది.అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫుడ్ లాంజ్ ఓపెనింగ్‌కి విజయ్ దేవరకొండ హాజరు కాగా, అక్కడ విజయ్‌ని చూసి ఉపాసన ఫుల్ ఖుష్ అయింది. అయితే ఫుడ్ లాంజ్ లో మాములు బోజనం కాకుండా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
రైతులు ఆర్గానిక్ ఫుడ్ ఎలా పండించాలో కూడా తన సూచనల ద్వారా తెలియజేస్తానంటుంది. అయితే తన ఆసుపత్రిలో ఫుడ్ లాంజ్ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ వచ్చినందుకు చాలా సంతోషించింది ఉపాసన. ఇక జులైలో ప్రసవం కానుందట ఉప్సీ. ఈ విషయాన్ని ఉపాసననే స్వయంగా తెలిపారు. ‘ప్రతి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాం.’ అని ఉపాసన పేర్కొన్నారు. అలాగే తను గర్భంతో ఉన్నప్పుడు భర్త రామ్ చరణ్ ఎంత సపోర్ట్ చేశాడో కూడా చెప్పారు. ‘పుట్టబోయే బిడ్డకు పూర్తి స్వేచ్చని ఇస్తాం. అయితే దాంతో పాటు గైడ్ లైన్స్, బాధ్యతలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు స్టార్‌డమ్‌తో పాటు కొండంత బాధ్యత కూడా వస్తుంది. దాని విలువ దానికి ఇవ్వాల్సిందే అని ఆమె చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…