Anam Venkata Ramana Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడివేడిగా సాగుతుంది. టీడీపీ,వైసీపీ నాయకులు మాటల తూటాలతో దాడులు చేసుకోవడం ఎప్పుడో మానేశారు. కర్రలు, రాడ్స్ తో కూడా దాడులకి దిగుతున్నారు. తాజాగా ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి ప్రయత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి ఆనం వెంకటరమణారెడ్డి వస్తుండగా సుమారు 10 మంది బైక్‌లపై వచ్చి అతనిపై కర్రలతో దాడికి ప్రయత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
కర్రలు, మారణాయుధాలతో సహా దుండగులు అపార్ట్ మెంట్ దగ్గరకు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. అపార్ట్ మెంట్ వాసులంతా కేకలు వేయడంతో దాడి చేయడానికి వచ్చినవారు పారిపోయారని చెబుతున్నారు. దాడికి ప్రయత్నించింది కచ్చితంగా వైసీపీ నాయకులేనంటూ ఆరోపణలు వినపడుతున్నాయి. ఆనం వెంకట రమణారెడ్డి టీడీపీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారని, అందుకే ఆయనపై దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దుండగులు వాడిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడడం అనాగరికం, అప్రజాస్వామికం అని అన్నారు అచ్చెన్నాయుడు. జగన్ తీరు చూస్తుంటే జర్మనీలో నాజీల దురాగతాలను కళ్ళకు కడుతోందన్నారు.
తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జ్యన్యాలను, దోపిడి విధానాన్ని జగన్ కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. ఆనంకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల ఆనం.. మంత్రి రోజాని టార్గెట్ చేస్తూ పంచ్‌లు విసిరారు. గతంలో కూడా మంత్రి రోజాను ఆయన చాలాసార్లు టార్గెట్ చేశారు. సీఎం జగన్ సహా.. ఆయన అందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు, చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక నాయకులంతా ఆనం వెంకట రమణారెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి ప్రయత్నించిన ఘటనపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇది వైసీపీ మూకల పనే అని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…