Vijay Deverakonda : అన‌సూయ‌కి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

Vijay Deverakonda : గ‌త కొద్ది రోజులుగా అన‌సూయ‌- విజ‌య్ దేవ‌రకొండ మ‌ధ్య జ‌రుగుతున్న కోల్డ్ వార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమా నుండి విజ‌య్ ని టార్గెట్ చేస్తూ అన‌సూయ ఏవేవో కామెంట్స్ చేస్తూ వ‌స్తుంది. ఖుషి సినిమా పోస్టర్‌లో హీరో పేరు ముందు ‘ది’ అని పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ ‘పైత్యం ఎక్కువైంది’ అంటూ ట్వీట్‌ చేసింది అనసూయ. దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించకపోయినా అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయను ట్రోల్‌ చేశారు. ఆ తర్వాత మధ్యలో డైరెక్టర్‌ హరీష్ శంకర్, కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ వంటి వారు కూడా ‘ది’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ నెట్టింట్లో పోస్టులు షేర్‌ చేయడం, వాటికి నటి రిప్లైలు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది.

కొద్ది రోజుల త‌ర్వాత వివాదంపై మాట్లాడిన అన‌సూయ‌.. విజయ్‌ తనకు మంచి స్నేహితుడని, కొన్ని పరిస్థితుల వల్ల తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకొచ్చింది. అలాగే ఇకపై విజయ్‌పై ట్వీట్లు చేయనని పేర్కొంది. వివాదం ఇక ముగిస‌న‌ట్టే అని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. ఖుషి చిత్ర ట్రైలర్ లాంచ్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహిచింది. ఈ ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి అనసూయతో అసలు వివాదం ఏంటి.. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అని ప్రశ్నించారు. దీనికి విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ.. ఏమో మీరు గొడవ పడే వాళ్లేనా అడగాలి. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు అంటూ సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు. మ‌రి దీనిపై అన‌సూయ ఎలా స్పందిస్తుంద‌నేది చూడాలి.

Vijay Deverakonda counter to anasuya
Vijay Deverakonda

ఇక తన పేరుకి ముందు ది అనే అక్షరం ఎందుకు చేరిందనే ప్రశ్న తాజాగా ఖుషి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ కి మీడియా నుండి ఎదురైంది. దీంతో ఆ అక్షరం పెట్టుకోవడానికి కారణం చెప్పుకున్నాడు విజయ్. ఏదో ఒక పేరు పెట్టకోమని ప్రెజర్ పెరిగింది.వద్దురాఅని కొట్లాడితే ఇష్టం వచ్చినట్టు రౌడీ స్టార్ అని సౌత్ సెన్సేషన్ అని రాస్తున్నారు. అదొక భయం కొత్తగా ఏం అంటిస్తారో అని , లైగర్ టైమ్ లో పూరీ గారు నీ పేరు కి ముందు ఏదో ఒకటి పెట్టాలి అంటూ రెండు మూడు పేర్లు చెప్పారు. నాకు అలా ట్యాగ్ ఇష్టం లేదు. నాకు విజయ్ దేవరకొండ సరిపోతుందని భావించి ఫైనల్ గా పేరుకి ముందు ది అని పెట్టుకున్నాను అని వివ‌ర‌ణ ఇచ్చారు. ఇక విజయ్ తన ప్రేమ పెళ్లి గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి దొరకాలి కదా. ఇంకా దొరకలేదు. మరో రెండు మూడు ఏళ్లలో పెళ్లి చేసుకుంటా అని విజయ్ సమాధానం ఇచ్చాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago