Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు. సరదాగా జోకులు వేస్తూ అలానే పంచ్‌లు వేస్తూ తెగ సందడి చేశారు. ఇంటర్వ్యూలో సినీ నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేశ్‌తో పాటు మూవీలో లీడ్ రోల్స్ చేసిన తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, రాజా రవీంద్ర, యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీముఖి రాజా రవీంద్ర గురించి చెప్పాలని అడిగింది.
నోటిదూల గాడు. మనసులో ఏం ఉండదు. బయటకు మాత్రం ఏదో ఒకటి వాగి, దొబ్బులు తింటుంటాడు. నన్ను చూస్తే చూశావయ్యా, ఆడపిల్లలను చూడకు. అంటే దరిద్రంగా అలాగే చూస్తాడు” అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అటు చిరంజీవితో తనది చాలా లాంగ్ జర్నీ అని చెప్పారు రాజా రవీంద్ర. “అన్నయ్యతో నాది లాంగ్ జర్నీ. ఏ సినిమా చేసిన ఫస్ట్ డేలా ఉంటుంది. చాలాసార్లు తిట్లు కూడా తిన్న. నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నానా? అని అప్పుడప్పుడూ చూస్తా. ఏంట్రా అలా చూస్తున్నావ్? చేతబడి చేసే వాడిలా ఆ చూపేంటి దరిద్రంగా. పో ఇక్కడి నుంచి అంటారు” అని చెప్పుకొచ్చారు.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా తర్వత చిరంజీవి నటించిన భోళా శంకర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపే చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ‘భోళా శంకర్’ టీమ్ మొత్తం అసలు విరామం లేకుండా సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి సైతం ఒకటి కూడా మిస్ అవ్వకుండా ప్రతీ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇక దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర కూడా ‘భోళా శంకర్’ ప్రమోషన్స్ బాధ్యతను తమ భుజంపై వేసుకున్నారు. ప్రేక్షకులు ఎంత నెగిటివిటీ చూపించినా.. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా.. మెహర్ మాత్రం తన సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. యాక్షన్, డ్రామా సహా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…