Chandrababu : చిరంజీవి మీద దాడి చేస్తారా.. చంద్ర‌బాబు ఆగ్ర‌హం..

Chandrababu : వాల్తేరు వీర‌య్య సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద వివాదాస్ప‌దం అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు పేల్చిన చిరంజీవి.. ఎంతసేపు సినిమా ఇండస్ట్రీ గురించి కాదు.. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపేలా, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి ఆలోచిస్తే మంచిదన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారన్నారు. చిరంజీవి వ్యాఖ్య‌ల‌కి వైసీపీ నాయ‌కులు ఫుల్ ఫైర్ అయ్యారు. కొడాలి నాని, రోజా, అంబ‌టి రాంబాబు, పేర్ని నాని వంటి వారు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు దీనిపై స్పందించారు. అన్నమయ్య జిల్లా అంగళ్లులో దాడి ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ చంద్రబాబు సహా మరో 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు. పోలీసులు తనపై హత్యాయత్నం కేసు పెట్టడంపై చంద్రబాబు స్పందించారు. తనపై హత్యాయత్నం చేసి, తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో అంగళ్లులో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లులో తనపై దాడి చేస్తారని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు వైసీపీ గూండాలు అంగళ్లు వచ్చారని ఆరోపించారు.

Chandrababu angry on cm ys jagan for chiranjeevi
Chandrababu

రాష్ట్రంలో అందరిపైనా కేసులు పెట్టారని, మీడియాకు, రాజకీయ నాయకులకు రక్షణ లేదని చంద్రబాబు ఆరోపించారు. చిరంజీవి చిన్న మాట అంటే ఎదురుదాడి చేస్తున్నారని, అధికారమనే పిచ్చిరాయి చేతిలో పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇంత ఘోరంగా వ్యవహరించి తనపైనే కేసు పెట్టారని, పోలీస్ అధికారులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. తనపైనే హత్యాయత్నం చేసి హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాస్తానని తెలిపారు. దోషులను ప్రజాక్షేత్రంలో నిలబెట్టే వరకు వదిలిపెట్టనని చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago