Nara Lokesh : మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చిరంజీవి కామెంట్స్ చేయగా, ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు చిరంజీవి వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తుండగా, వైసీపీ నాయకులు మాత్రం దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారిలో చిరంజీవి కూడా ఒక్కరంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు రోజా, కొడాలినాని, అంబటి రాంబాబు, అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్.. ఇలా వైసీపీకి చెందిన వారంతా కూడా కౌంటర్స్ ఇస్తున్నారు.
ఇక చిరంజీవి కామెంట్స్‌కు మద్దతుగా పలువురు టీడీపీ నాయకులు ముందుకొస్తున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొత్త పల్లి సుబ్బారాయుడు మెగాస్టార్‌కు మద్దతుగా నిలిచారు. చిరంజీవి అన్నదాంట్లో తప్పేముందంటూ వైసీపీ నాయకులకు కౌంటర్లిచ్చారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యవహారంపై స్పందించారు. యువగళం పాదయాత్రలో మాట్లాడిన ఆయన మెగాస్టార్ చిరంజీవి మద్దతునిస్తూనే వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. ‘సినిమా పరిశ్రమపై కక్ష కట్టవద్దని చిరంజీవి అనడం తప్పా? సినిమా పరిశ్రమపై రాజకీయాలు చెయ్యొద్దన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి.. సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండన్నారు. ఇందులో తప్పేముందో వైసీపీ నేతలే చెప్పాలి.
చంద్రబాబుని, నన్ను, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తూ కట్టు కథలతో సినిమాలు తీసిన రోజు ఈ వైసీపీ నేతలకు విలువలు గుర్తుకు రాలేదా?’ అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. మొత్తానికి భోళా శంకర్ చిత్ర రిలీజ్‌కి ముందు చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇక భోళా శంకర్ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కానుండగా, ఈ సినిమా తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…