Vijay Deverakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌పై మ‌ళ్లీ రూమ‌ర్స్ మొద‌లు.. ఈసారి ఏమిటి..?

Vijay Deverakonda : టాలీవుడ్‌లో క్రేజీ జంట‌గా పేరు తెచ్చుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక‌. రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై ఈ జంట ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. పోనీ కాదని కూడా చెప్పలేదు. కానీ ఇలా అడిగిన ప్రతిసారి ముసిముసినవ్వులు నవ్వుతూ ఉంటారు. కానీ చాలా సార్లు వీళ్లిద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లారని రుజువైంది. వీళ్లు సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను చూసి ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ ఫ్యాన్స్ ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టేవారు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా జంటగా వెళ్లినప్పటికీ వీరు పెట్టే పోస్టుల ద్వారానే వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్నో సార్లు వీరిద్దరూ దొరికిపోయారు తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి కల్కి సినిమా చూశారని తెలుస్తోంది.వీరిద్దరూ కల్కి సినిమా గురించి ఒకేసారి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం పట్ల నేటిజన్స్ మరోసారి వీరి రిలేషన్ గురించి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి కల్కి సినిమా చూశారని అందుకే ఇలా ఒకేసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే విజయ్ దేవరకొండ హీరో గా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రాయలసీమ ప్రాంత నేపథ్యం లో రూపొందబోతుంది.

Vijay Deverakonda and rashmika mandanna once again they are in news
Vijay Deverakonda

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ రాయలసీమ యాస , భాష తెలిసిన నటీనటులు కావాలి అని ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈమె పాత్ర కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడబోతున్నట్లు సమాచారం. ఈ భాషలో మాట్లాడడం కోసం రష్మీక ఇప్పటికే ప్రత్యేక కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప‌లో ర‌ష్మిక రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో అద‌ర‌గొట్ట‌గా ఇప్పుడుఈ చిత్రంలోను త‌న స్లాంగ్‌తో సంద‌డి చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే గతంలోనే విజయ్ దేవరకొండ , రష్మిక కాంబినేషన్లో గీత గోవిందం , డియర్ కామ్రేడ్ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో గీత గోవిందం సూపర్ సక్సెస్ సాధించగా , డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక విజయ్ దేవరకొండ , రాహుల్ కాంబోలో ఇది వరకు టాక్సీవాలా అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago