Disha Patani : బీ టౌన్ బ్యూటీ ‘దిశా పటానీ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చాలా ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ మళ్లీ కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈమె గతంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాగా, ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దిశా ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్లీ బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ బ్యూటీ కల్కి సినిమాతో తెలుగు తెరపై అలరించింది . ప్రస్తుతం ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ) అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తన అందాలతో అందరినీ మాయ చేయడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది.
సినిమా కెరీర్‌ను సరిగా ఆరంభించని దిశా పటానీ.. ఎంఎస్ ధోని చిత్రంతో హిందీ పరిశ్రమలోకి వెళ్లింది. ఇది భారీ సక్సెస్ అవడంతో ఆమెకు అక్కడ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా స్టార్‌డమ్ కూడా అందుకున్న దిశా.. ‘కుంగ్‌పూ యోగా’, ‘వెల్‌కం టు న్యూయార్క్’, ‘భాగీ 2’, ‘భారత్’, ‘మలాంగ్’, ‘భాగీ 3’, ‘రాధే’ వంటి మూవీలతో వచ్చి యమా అలరించింది. రీసెంట్‌గా వచ్చిన కల్కి చిత్రంలో కూడా తన పాత్రతో అదరగొట్టింది. అయితే దిశా పటానీ చేతిపై ‘PD’ అనే రెండు అక్షరాలతో ఓ పచ్చబొట్టు ఉంది. అయితే ఈ టాట్ కాస్త వైరల్ కావడంతో.. దీనిని గమనించిన చాలామంది నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ కు అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ఆ టాటు అర్ధం PD అంటే ‘ప్రభాస్ డార్లింగ్’ అని కొంతమంది చెప్తున్నారు. అదే సమయంలో పీడీ అంటే ‘ప్రభాస్, దిశా పటానీ’ అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టాటూ అర్ధం కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే కల్కి సినిమాలో దిశా నటించడం వలనే కారణం అని చర్చించుకుంటుంటే.. మరి కొందరు అభిమానులు మాత్రం దిశాను ప్రభాస్ డార్లింగ్ అనే పేరు టాటూగా ఎందుకు తీసుకున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దిశా పటాని దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. కాగా దిశా పటాని, కల్కి 2898 AD కోసం ఏ ఈవెంట్స్ లో పాల్గొనలేదు. అలాగే కల్కి సినిమాలో ప్రభాస్ తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. అయిన వారిద్దరి మధ్య ఇంతకు ముందు స్నేహం కానీ, ఆ బాండింగ్ ఏమి లేవు. మరి ఈ రూమర్స్ ఫేక్ అయి కూడా ఉండొచ్చు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…