Vijay Devarakonda Watch : అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన యువ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత గీతా గోవిందం వంటి మూవీతో మంచి హిట్ కొట్టిన విజయ్ ఆ తర్వాత మంచి హిట్ అందుకోలేకపోయాడు. ఇక రీసెంట్‌గా లైగర్ సినిమా రిసల్ట్ తో డీలా పడిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని నమోదు చేయడమే కాకుండా, విజయ్ పాన్ ఇండియా ఎంట్రీని కూడా భారీగా ప్లాప్ చేసినట్టయింది. దీంతో ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో అయోమయం నెలకొని ఉంది.
లైగర్ తర్వాత పూరీజగన్నాధ్ తో మొదలుపెట్టిన పాన్ ఇండియా మూవీ ‘జనగణమన’ పట్టాలు ఎక్కకుండానే గాడి తప్పింది. ప్రస్తుతం ఖుషీ అనే మూవీ చేస్తుండగా ఇందులో సమంత కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ కూడా సమంత అనారోగ్యం కారణంగా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే విజయ్ దేవరకొండ స్టైల్‌కి కేరాఫ్ అడ్రెస్ అనే విషయం మనందరికి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుల్లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు.
ఈ ఫొటోలో విజయ్ ధరించిన రిస్ట్ వాచ్ ధర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వాచ్ కాస్ట్ తెలుసుకున్న అభిమానులు నోరెళ్ల బెడుతున్నారు. కార్టియర్ బ్రాండ్ కు చెందిన ఆ వాచ్ విలువ రూ.30 లక్ష 43 వేలు ఉంటుందట. ఇంత కాస్ట్లీ వాచ్ ధరించడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా హీరోల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక విజయ్ విషయానికి వస్తే ఆయనకు కార్లు అంటే చాలా ఇష్టం. విజయ్ కి బాగా నచ్చిన వోల్వో, బెంజ్ లాంటి టాప్ బ్రాండ్ కార్లను కొనుగులు చేసినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పట్లో ఓ ప్రైవెట్ జెట్ నూ కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…