Rishab Shetty : కాంతారా మూవీకి హీరో రిష‌బ్ శెట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. షాక‌వుతారు..!

Rishab Shetty : ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ప్రయోగాత్మక కథలతో సినిమాలు వ‌స్తుండ‌గా, వీటికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే స్పందన కూడా లభిస్తోంది. ఫలితంగా ఈ తరహాలో వచ్చిన చాలా చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే ‘కాంతార కాగా, ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భించింది. ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమా ‘కాంతార కాగా, ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించ‌గా అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు.

క‌న్న‌డంలోనే కాదు ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా మంచి ఆద‌ర‌ణ పొందింది. రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేసి, నటించిన కాంతార మూవీ కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ.. ఓటిటి, శాటిలైట్ రైట్స్ లాంటి ఇతర హక్కులు కాకుండానే కేవలం థియేటర్ల ద్వారానే ఈ సినిమా రూ. 406 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన‌ట్టు తెలుస్తుంది. త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమాకి అన్ని కోట్లు వ‌సూలు తెచ్చి పెట్టిన రిష‌బ్ శెట్టికి ఎన్ని కోట్ల పారితోషికం ఇచ్చి ఉంటార‌నే అనే ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. ఈ సినిమాలో హీరో గా చేస్తూ డైరెక్ట్ చేసినందుకు నాలుగు కోట్లు మాత్రమే చెల్లించారట‌.

Rishab Shetty remuneration for kantara movie
Rishab Shetty

ఇక అంత పెద్ద హిట్ అయిన క్ర‌మంలో సాధార‌ణంగా నిర్మాత‌లు ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌లు ఇస్తారు. కాని అలాంటిది కూడా ఏమి జ‌ర‌గ‌లేదు. అంత పెద్ద విజ‌యం అందించిన రిష‌బ్‌కి త‌క్కువ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం ప‌ట్ల ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక కాంతార మూవీలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర పోషించిన కిషోర్, రిషబ్ శెట్టి సరసన హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడకు చెరొక కోటి రూపాయలు పారితోషికంగా చెల్లించారు. రాజుకు వారసుడి పాత్రలో కనిపించిన అచ్యుత్ కుమార్ రూ. 40 లక్షలు అందుకున్నాడు. సుదారక పాత్ర పోషించిన ప్రమోద్ శెట్టి 60 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago