Vishal : కోలీవుడ్ హీరో విశాల్ తన తాజా చిత్రం లాఠీ మూవీ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తాడని గత కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాను కుప్పం నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక సీఎం జగన్, పవన్ కళ్యాణ్‌ల మీద కూడా స్పందించాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని, అయితే ఓటు వేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా జగన్‌కే వేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని విశాల్ చెప్పిన మాటల మీద ఇప్పుడు జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాల్ లాఠీ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సినిమాలు థియేటర్లో చూడటం వేరు.. ఓటీటీలో చూడటం వేరు.. నీ సినిమాను ఐ బొమ్మలోనూ చూడటం వేస్ట్ అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విశాల్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా లాఠీ సినిమా మీద పడేట్టు కనిపిస్తున్నాయి.అయితే అంతకముందు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని.. ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు తెలుసున చెప్పుకొచ్చాడు. విశాల్ తండ్రి చిరంజీవితో కలిసి ఎస్పీ పరశురామ్ సినిమా చేసినప్పుడే తాను పవన్ ని చూసానని, ఆ తర్వాత ఆయనకున్న క్రేజ్, యూనిక్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించాడు పవన్.
పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన తర్వాత ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడడం పవన్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఈ సినిమా తెలుగు ప్రమోషన్లకు వచ్చిన విశాల్… లేని పోని చిక్కులని తెచ్చిపెట్టుకుంటున్నాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…