Rishab Shetty : ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ప్రయోగాత్మక కథలతో సినిమాలు వస్తుండగా, వీటికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే స్పందన కూడా లభిస్తోంది. ఫలితంగా ఈ తరహాలో వచ్చిన చాలా చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమానే ‘కాంతార కాగా, ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించింది. ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమా ‘కాంతార కాగా, ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించగా అంజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం సమకూర్చారు.
కన్నడంలోనే కాదు ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా మంచి ఆదరణ పొందింది. రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేసి, నటించిన కాంతార మూవీ కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ.. ఓటిటి, శాటిలైట్ రైట్స్ లాంటి ఇతర హక్కులు కాకుండానే కేవలం థియేటర్ల ద్వారానే ఈ సినిమా రూ. 406 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాకి అన్ని కోట్లు వసూలు తెచ్చి పెట్టిన రిషబ్ శెట్టికి ఎన్ని కోట్ల పారితోషికం ఇచ్చి ఉంటారనే అనే ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. ఈ సినిమాలో హీరో గా చేస్తూ డైరెక్ట్ చేసినందుకు నాలుగు కోట్లు మాత్రమే చెల్లించారట.
ఇక అంత పెద్ద హిట్ అయిన క్రమంలో సాధారణంగా నిర్మాతలు ప్రత్యేకమైన గిఫ్ట్‌లు ఇస్తారు. కాని అలాంటిది కూడా ఏమి జరగలేదు. అంత పెద్ద విజయం అందించిన రిషబ్‌కి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంతార మూవీలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర పోషించిన కిషోర్, రిషబ్ శెట్టి సరసన హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడకు చెరొక కోటి రూపాయలు పారితోషికంగా చెల్లించారు. రాజుకు వారసుడి పాత్రలో కనిపించిన అచ్యుత్ కుమార్ రూ. 40 లక్షలు అందుకున్నాడు. సుదారక పాత్ర పోషించిన ప్రమోద్ శెట్టి 60 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు.