రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి. ఈ క్రమంలోనే వర్మ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్మ ట్విట్టర్‌లోనూ యాక్టివ్‌గా ఉండడం లేదు. మరోవైపు ఎప్పటికప్పుడు ఆయన మీద కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో బెయిల్ తెచ్చుకోవడంతోనే ఆయనకు టైమ్ అయిపోతోంది. ఇక సినిమాలు తీసేందుకు అసలు సమయం లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పలు సినిమాలను తీశారు. అలాగే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వచ్చారు. దీంతో ఆయన వార్తల్లో నిలిచారు. కానీ ఈ మధ్య సైలెంట్ అయ్యారు.
ఈ క్రమంలోనే వర్మ మళ్లీ సినిమా లైఫ్‌ను యథావిధిగా ప్రారంభించాలని, రాజకీయాలకు దూరంగా ఉండాలని, అనవసరంగా లేని పోని వాటిల్లో తలదూర్చడం ఎందుకు అని వర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆయన పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఒక వీడియో బాగా పాపులర్ అవుతోంది. అందులో యాంకర్ ఆయనను ప్రశ్నలు అడుగుతుండగా ఆయన సమాధానాలు చెప్పారు.
సినిమాల్లో ఎప్పుడూ పోలీసులు చివర్లోనే ఎందుకు వస్తారు అని యాంకర్ అడగ్గా.. అందుకు వర్మ స్పందిస్తూ.. క్రైమ్ జరిగాకే కదా పోలీసులు వచ్చేది, పోలీసులకు క్రైమ్ జరగబోతోంది అని ముందే ఎలా తెలుస్తుంది, కనుకనే వారు సినిమాల్లో చివర్లోనే వస్తారు.. అని వర్మ రిప్లై ఇచ్చారు. దీంతో షాక్ తినడం యాంకర్ వంతైంది. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక వర్మ ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయడం లేదు.