Telugu Anchors : సినిమాలకి హీరోలు హీరోయిన్లు ఎంత ఇంపార్టెంటో బుల్లి తెరకి యాంకర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏ షోకి అయిన కొందరు యాంకర్స్ ఇట్టే సెట్ అవుతారు. వారు ఇప్పుడు టాప్ యాంకర్స్‌గా కూడా చలామణీ అవుతున్నారు. అయితే ఎపిసోడ్ లేదా ఆడియో ఫంక్షన్లకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారో తెలుసుకుందాం . బుల్లితెర యాంకర్స్ లో మొదటగా చెప్పుకోవాల్సి వస్తే సుమ కనకాల గురించి చెప్పుకోవాలి. మొదట్లో బులితెర నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగిన సుమ ఆ తర్వాత ఈవెంట్స్, రియాలిటీ షో లతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె ఈవెంట్ కు రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటుండగా, షోలకు దాదాపు అదే రేంజ్ లో తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇక బుల్లితెరకు గ్లామర్ అద్దిన అనసూయ ఒక్కో ఈవెంట్ కు రూ.2-3 లక్షలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందంట. మరోవైపు సినిమలు, వెబ్ సిరీస్ ల ద్వారాను బాగానే సంపాదిస్తుంది. ఇక జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన రష్మీ గౌతమ్ ఒక్కో ఈవెంట్ కు రెండు నుంచి మూడు లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటుందంట. ఇక మరొలేడి యాంకర్ మంజూష అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మంజుషా కూడా 30వేల రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. ఇక మేల్ యాంకర్స్ లో యాంకర్ రవి గురించి ఎంత చెప్పిన తక్కువే. అతడు తనదైన మాటలతో, కామెడీ పంచులతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటారు.
రవి బిగ్ బాస్ షోతోను ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఆయన ప్రస్తుతం లక్ష రూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరో మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి అవకాశాలతో ముందుకు దూసుకు వెళ్తున్న ప్రదీప్ ఒక్కో ఈవెంట్ కు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్. ఇక ఇతర యాంకర్ల విషయానికి వస్తే.. యాంకర్ వర్షిణీ 30వేల రెమ్యునరేషన్, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇక ఇక ఇటీవలే జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా వచ్చిన కన్నడ నటి సౌమ్యరావు ఒక్కో ఎపిసోడ్ కు సౌమ్యరావు రూ.60 వేలు తీసుకుంటున్నట్టు టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…