Venkatesh Daughter Marriage : వెంకీ కూతురి నిశ్చితార్ధ వేడుక‌లో సంద‌డి చేసిన మ‌హేష్‌, చిరు

Venkatesh Daughter Marriage : టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సంద‌డి నెల‌కొంది. ప‌లువురు సెల‌బ్రిటీల పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. న‌వంబ‌ర్ 1న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య వివాహం చేసుకోనుండ‌గా, నిశ్చితార్థం న‌వంబ‌ర్ 5న జ‌ర‌గ‌నుంది. ఇక రీసెంట్‌గా వెంక‌టేష్ కూతురి నిశ్చితార్థ వేడుక జ‌ర‌గ‌గా, పెళ్లి కూడా మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నుంది. అయితే వెంకటేష్ దగ్గుబాటి రెండో కూతురు హయవాహిని వివాహ నిశ్చితార్థం విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో జరిగింది. పెళ్లి కొడుకు వివరాలను, వారి కుటుంబ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. అత్యంత సీక్రెట్‌గా హయవాహిని దగ్గుబాటి ఎంగేజ్‌మెంట్‌ అక్టోబర్ 25వ తేదీ రాత్రి జరిగింది. అయితే మీడియాకు, ఇతర వర్గాలకు తెలియకుండా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించారు.

వ‌చ్చే ఏడాది మార్చిలో పెళ్లి జ‌రిపించాల‌ని ఇరు కుటుంబాల వారు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో చిరంజీవి, మ‌హేష్ బాబు, రానా, నాగ‌చైత‌న్య‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోలు సంద‌డి చేశారు. హ‌వ్య వాహిని ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. నిశ్చితార్థ వేడుక‌కి చిరంజీవి, మ‌హేష్ బాబు స‌తీస‌మేతంగా హాజ‌రై సంద‌డి చేశారు. పెద్దోడు.. చిన్నోడిని రిసీవ్ చేసుకున్న విధానం అంద‌రిని ఆక‌ట్టుకుంది. త్వ‌ర‌లో పెళ్లికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక వెంక‌టేష్‌, నీరజ దంప‌తుల‌కు ఆశ్రీత‌, హ‌వ్య‌వాహిని, భావ‌న‌తో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. ఆశ్రీత పెళ్లి 2019లో జ‌రిగింది. తాను ప్రేమించిన వినాయ‌క్ రెడ్డితో ఆశ్రీత ఏడ‌డుగులు వేసింది. హ‌వ్య‌వాహినిది మాత్రం అరెంజెడ్ మ్యారేజీ అని స‌మాచారం.

Venkatesh Daughter Marriage mahesh babu and chiranjeevi attended
Venkatesh Daughter Marriage

వెంక‌టేష్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సైంధ‌వ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నీ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలుత ఈ సినిమాను డిసెంబ‌ర్ 22న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ అదే రోజు స‌లార్ బ‌రిలో నిల‌వ‌డంతో సంక్రాంతికి సైంధ‌వ్‌ను వాయిదావేశారు. సైంధ‌వ్ త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్‌తో వెంక‌టేష్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago