KTR : ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ తెలంగాణ, ఏపీ రాజకీయాలు ఎంత ఆసక్తిగా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ నేతలపై ఏపీ నేతలు కామెంట్ చేయడం, ఏపీ నేతలపై తెలంగాణ నేతలు పంచ్‌లు వేయడం ఆసక్తిని కలిగిస్తుంది. ఒక టీవీచానల్‌లో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో ఇష్టాగోష్ఠిగా కేటీఆర్ మాట్లాడారు. నరకప్రాయమైన రాజకీయాలను ఎలా భరిస్తున్నారన్న జేపీ ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘పంచాయతీలో సర్పంచి పక్కన సీటు ఇవ్వాలని ఎంపీటీసీ, మరోచోట ఎంపీడీవో పక్కన సీటు కావాలని జెడ్పీటీసీ అడుగుతారు. ఇద్దరినీ సంతృప్తి పరిచేలా మాట్లాడాలి. నిత్యం ఇలాంటి పంచాయితీలు ఎన్నో వస్తుంటాయి’’ అన్నారు.
2009లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనప్పుడు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల నుంచి కార్యకర్త ఫోన్ చేసి, నీళ్ల ట్యాంకర్ వచ్చింది… బిందెలు క్యూలో పెట్టి వరుసగా పట్టుకొనేట్లు చూడన్నా అని రిక్వెస్ట్ చేశాడని వెల్లడించారు.అమెరికాలో ఐటీ కంపెనీ పెట్టిన ముగ్గురు తెలుగు యువకులు ఇటీవలే వరంగల్లో బ్రాంచ్ పెట్టుకున్నారని, అందులో ఇద్దరు ఏపీ వాళ్లు ఉండటంతో ఏపీలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీకంపెనీ పెట్టాలని వారికి సూచించానని వెల్లడించారు. ‘‘అవసరమైతే అక్కడి సీఎం జగనన్నతో మాట్లాడి భూమి ఇప్పిస్తా’’ అన్న మాటను పట్టుకొని తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ప్రస్తావించారు. అక్కడ కూడా అభివృద్ధి జరగాలన్నదే తన ఉద్దేశం అన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై జేపీ స్పందిస్తూ,‘‘ఉద్యమ సమయంలో హైదరాబాద్ గురించి అనేక అనుమానాలుండేవి. ఇక్కడ ఉంటున్న ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఆందోళన ఉండేది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అలాంటి ప్రతికూల ఆలోచనలకు తావివ్వకుండా సమ దృష్టిలో చూసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వెళుతుంది. దీనికి మీ ప్రభుత్వాన్ని వందశాతం అభినందిస్తున్నా’’ అన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యేగా అధికారం రుచి మరిగిన జేపీకి.. మరోసారి అలాంటి హోదా కుదిరితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ అందుకోవాలని ఉబలాటపడుతున్నారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…