Venkatesh Daughter Marriage : టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. పలువురు సెలబ్రిటీల పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య వివాహం చేసుకోనుండగా, నిశ్చితార్థం నవంబర్ 5న జరగనుంది. ఇక రీసెంట్గా వెంకటేష్ కూతురి నిశ్చితార్థ వేడుక జరగగా, పెళ్లి కూడా మరి కొద్ది రోజులలో జరగనుంది. అయితే వెంకటేష్ దగ్గుబాటి రెండో కూతురు హయవాహిని వివాహ నిశ్చితార్థం విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో జరిగింది. పెళ్లి కొడుకు వివరాలను, వారి కుటుంబ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. అత్యంత సీక్రెట్‌గా హయవాహిని దగ్గుబాటి ఎంగేజ్మెంట్ అక్టోబర్ 25వ తేదీ రాత్రి జరిగింది. అయితే మీడియాకు, ఇతర వర్గాలకు తెలియకుండా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించారు.
వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్యతో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. హవ్య వాహిని ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. నిశ్చితార్థ వేడుకకి చిరంజీవి, మహేష్ బాబు సతీసమేతంగా హాజరై సందడి చేశారు. పెద్దోడు.. చిన్నోడిని రిసీవ్ చేసుకున్న విధానం అందరిని ఆకట్టుకుంది. త్వరలో పెళ్లికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక వెంకటేష్, నీరజ దంపతులకు ఆశ్రీత, హవ్యవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. ఆశ్రీత పెళ్లి 2019లో జరిగింది. తాను ప్రేమించిన వినాయక్ రెడ్డితో ఆశ్రీత ఏడడుగులు వేసింది. హవ్యవాహినిది మాత్రం అరెంజెడ్ మ్యారేజీ అని సమాచారం.
వెంకటేష్ విషయానికి వస్తే ప్రస్తుతం సైంధవ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్నీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు సలార్ బరిలో నిలవడంతో సంక్రాంతికి సైంధవ్‌ను వాయిదావేశారు. సైంధవ్ తర్వాత తరుణ్ భాస్కర్‌తో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.