Varalaxmi Sarathkumar : తమిళ స్టార్ శరత్ కుమార్ నట వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. శరత్ కుమార్ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించినట్లుగానే, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో వరలక్ష్మి చేసిన సినిమాలు మరియు పాత్రలు నిలిచి పోయేలా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. గంభీరమైన గొంతుతో.. కరుకైన మాటతో.. హావభావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
చిన్నతనంలో తనపై లైంగిక దాడి జరిగిందని షాకింగ్ విషయాన్ని తెలిపింది. అంతే కాదు ఓ టీవీ ఛానెల్ అధినేత తనతో పడుకోవాలంటూ అడిగాడని.. తను వెంటనే పోరా పోరంబోకు అంటూ చెయ్యి చేసుకోబోయే సరికి పారిపోయాడంటూ.. నమ్మలేని విషయాలు వెల్లడించారు. ఇక తన కెరీర్ గురించి చాలా విషయాలు చెప్పారు వరలక్ష్మి. తను నటి అవ్వాలి అనకున్నప్పుడు తన తండ్రి శరత్ కుమార్ వద్దన్నారని. కానీ తన తల్లి రాధికతో కలిసి శరత్ కుమార్ ను ఒప్పించారనన్నారు.
తను కూడా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశానని తెలిపారు వరలక్ష్మి. తనకు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటుగా ఫ్రెంచ్, స్పానిష్ కూడా వచ్చు అన్నారు. ఇక తాను చేస్తున్న సమాజ సేవ గురించి కూడా వివరించారు. తన తల్లి చేస్తున్న బిజినెస్ లు మాన్పించి.. తను స్టార్ట్ చేసిన శ్రీ శక్తి ఎన్జీవో పనులు అప్పగించిందట. అత్యాచారాలకు గురైన వారికి అండగా ఉండటం. గృహహింసకు సబంధించిన వారి తరపున కోర్టుల్లో పోరాడటం లాంటివి చేస్తున్నారు. యశోద సినిమాలో ఫెర్టిలిటీ సెంటర్ ఓనర్ గా నటించింది వరలక్ష్మి. ప్రస్తుతం బాలయ్య – మలినేని గోపీచంద్ సినిమాలో కూడా నటిస్తోంది వరలక్ష్మి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…