Kongara Jaggaiah : భారతదేశంలో రాజకీయాలు, సినీరంగం వేరు వేరుగా చూడలేం. ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీలు పెట్టి జాతీయ పార్టీలకు సైతం ముచ్చెమటలు పట్టించి ముఖ్యమంత్రులుగా ఎదిగారు. ముఖానికి రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికి రారని అన్న వారి చేత శెభాష్ అనిపించుకున్నారు. అలా రాజకీయాలలో చక్రం తిప్పిన వారి విషయానికి వస్తే ఎంజీఆర్, జయలలిత పేర్లు గుర్తుకు వస్తాయి. అంతేకాకుండా తెలుగునాట సినిమాల్లో రాణించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరవాత సంచలనాలు సృష్టించిన నటుడు ఎన్టీరామారావు అని అందరికీ తెలుసు.
కానీ ఎన్టీఆర్ కంటే మందే ఓ నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో రాణించారన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎంతో మంది పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొట్టమొదటి సారి పార్లమెంటులో అడుగుపెట్టిన వ్యక్తికి ఉండే స్థానం వేరు కదా. ఆయనే కొంగర జగ్గయ్య ఎన్టీఆర్ కు కూడా సన్నిహితుడు కావడం విశేషం. ఈయన గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ గ్రామంలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో కొంగర జగ్గయ్య చదువుకున్నాడు. అదే కాలేజీలో ఎన్టీరామారావు కూడా విద్యను అభ్యసించారు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత జగ్గయ్య వరుసగా 3 సంవత్సరాల పాటు ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి జగ్గయ్య నాటకాలు కూడా వేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే జగ్గయ్య రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. జయప్రకాష్ స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీలో జగ్గయ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక 1956 కాంగ్రెస్ లో చేరారు. 1967వ సంవత్సరంలో ఒంగోలు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యాడు. ఆయనకు 80వేల మెజారిటీ రావడం విశేషం. ఇక ఎంపీగా గెలిచిన తరవాత ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను జగ్గయ్య చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…