Mosquitoes : రోజూ దోమలు చంపేస్తున్నాయా..? రక్తాన్నీ పీల్చేస్తున్నాయా..? జాగ్రత్త.. దోమ కాటుపై అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే.. దోమకాటు అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో దోమలను తరిమేందుకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం కొన్ని రసాయనాల వల్ల దోమలకు మాత్రమే కాదు.. మనుషులకు కూడా ఇబ్బందే. మార్కెట్లో లభించే దోమల నివారణ మందులను దీర్ఘకాలంగా వాడడం వల్ల శ్వాసకోస వ్యాధులు, మానసిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.
దోమ కాటు వలన దురద మరియు శరీరంపైన దద్దురులు వస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండే సహజ సిద్ధమైన మార్గాల్లో మాత్రమే దోమలపై యుద్ధం చేయడం మంచిది. ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా గురించి తెల్సుకుందాం. ఈ చిట్కా కోసం 5 పదార్థాలు అవసరం అవుతాయి. వేపాకులు 50 గ్రాములు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. 50 గ్రాముల వెలుల్లి తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.
పిప్పళ్లు 2 గ్రాములు, 25 గ్రాముల లవంగాలు, పలావ్ ఆకులు రెండింటిని తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వేపాకుల పొడి, వెల్లుల్లి తొక్కల పొడి, లవంగం, పిప్పళ్లు, పలావ్ ఆకుల పొడి అన్నింటిని బాగా కలిపి నీటిని చేర్చుతూ మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని చిన్న చిన్న దిమ్మలుగా చేయాలి. వీటిని మూడు గంటల పాటు ఆరబెట్టాలి. బాగా ఆరాక గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ ఉంచుకోవాలి. దోమలు ఉన్న ప్రదేశంలో ఒక దిమ్మను పెట్టి వెలిగిస్తే ఆ పొగకు దోమలు పారిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…