Premikudu Movie : డైరెక్టర్ శంకర్ భారతీయ సినీచరిత్రలో ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు తీసి అభిమానులకు అలరించారు. 1993లో అర్జున్ హీరోగా నటించిన జెంటిల్ మ్యాన్ చిత్రంతో దర్శకుడుగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు శంకర్. ఈ సినిమా అప్పటిలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చగా ప్రభుదేవా చికుబుకు చికుబుకు రైలే అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ సినిమా నిర్మాత కుంజుమన్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. దానితో శంకర్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత కుంజుమన్. ఇక శంకర్ ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు అనే సినిమా కథను నిర్మాతకు వినిపించారు. ఈ సినిమాలో హీరో గవర్నర్ కి పేదవారు అంటే అసహ్యం. అలాంటి గవర్నర్ కూతురిని హీరో ప్రేమిస్తాడు. ఈ కథ నచ్చడం.. నిర్మాత కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో షూటింగ్ ప్రారంభించారు.
అయితే ప్రేమికుడు సినిమాలో గవర్నర్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడని అదే సినిమాకు థీమ్ అనే విషయం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కార్యాలయం వరకు చేరింది. ఆ సమయంలో గవర్నర్ గా చెన్నారెడ్డి ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. ఈ విషయం తెలియగానే ప్రేమికుడు సినిమాను ఆపివేయాలని సినిమాలో గవర్నర్ కు సంబంధించిన సన్నివేశాలను తొలగించాలని గవర్నర్ చెన్నారెడ్డి కార్యాలయం నుండి నిర్మాతకు బెదిరింపులు వెళ్లాయట. ఆ బెదిరింపులతో నిర్మాత కుంజుమన్ ఈ విషయాన్ని సీఎం జయలలిత దృష్టికి తీసుకువెళ్లారట.
దాంతో జయలలిత సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు లేకుండా తీసుకోవాలని పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సీఎం పర్మిషన్ ఇవ్వడంతో ప్రేమికుడు సినిమా పట్టలెక్కి చక చకా షూటింగ్ పనులు పూర్తయ్యింది. ఆ తరవాత సినిమా చూసిన జయలలిత కూడా సినిమా చాలా బాగుందని చెప్పారట. అలా గవర్నర్ అడ్డుకున్న ప్రేమికుడు సినిమా ఎన్నో ఒడిదుడుకుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకుని 17 సెప్టెంబర్ 1994న విడుదలైంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రెండు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక గుర్తింపులు దక్కించుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…