Nara Lokesh : లోకేష్ పాద‌యాత్ర‌లో స‌డెన్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా.. ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన లోకేష్..

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర స‌క్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది. ప్ర‌స్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. అయితే.. విజయవాడలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించగా… టీడీపీ యువనేత నారా లోకేశ్ ను వంగవీటి రాధా కలిశారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రాధా… పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా నినాదాలు మిన్నంటాయి. “జై లోకేశ్, జై రాధా” అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

లోకేశ్ రాకతో విజయవాడ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముందుకు సాగుతుండ‌గా, గన్నవరం నియోజకవర్గంలో దాదాపు16 కిలోమీటర్ల మేర సాగింది . పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఏకధాటిగా 12 గంటల పాటు పాదయాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో నిన్న షెడ్యూల్ కంటే 8 గంటలు ఆలస్యంగా ముగిసింది. ఇప్పటి వరకూ 2,525 కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేసుకున్నారు.

vangaveeti radha in Nara Lokesh pada yatra
Nara Lokesh

గన్నవరం నియోజకవర్గంలో తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ విపక్ష టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ ఎప్పుడో ఖరారు చేసిన నేపథ్యంలో తనకు టికెట్ కావాలని కోరుతూ చివరి ప్రయత్నాలు చేసిన యార్లగడ్డ.. అవి కాస్తా సఫలం కాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన యార్లగడ్డ ఇవాళ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు.వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ పోటీ చేయడం ఖాయమైంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago