Chiranjeevi : నా విల‌న్స్ నా ఇంట్లోనే నా మ‌న‌వ‌రాళ్ల రూపంలో ఉన్నారన్న చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఆయ‌న ఖ్యాతి గురించి,రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.వరుస సినిమాలలో నటిస్తున్న చిరంజీవి ఆ సినిమాలతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు. ఈ కాలం వారికి చిరంజీవి స‌త్తా గురించి ప్ర‌త్యేకంగా తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఒక‌ప్పుడు చిరంజీవి అంటే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయేవారు. అయితే త‌న గురించి త‌న మ‌న‌వ‌రాళ్ళ‌కి తానే డ‌బ్బా కొట్టుకోవల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఓ సంద‌ర్భంలో చిరంజీవి ఫ‌న్నీగా తెలియ‌జేశారు. శూన్యం నుండి శిఖ‌రాగ్రాలకు పుస్త‌కావిష్క‌ర‌ణ వేడుక‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వ‌య‌సున్న మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు.

వాళ్ల‌కు హీరోలుగా రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్, సాయితేజ్ మాత్ర‌మే తెలుసు. వాళ్ల‌నే హీరోలుగా ఫీల‌వుతుంటారు. వాళ్ల సాంగ్స్ మాత్ర‌మే వింటుంటారు, చూస్తుంటారు. నా కెరీర్ లో ఎన్నో సూప‌ర్ హిట్స్ సాంగ్స్ ఉన్నాయి. కానీ అవేవీ అడ‌కుండా చ‌ర‌ణ్ నాటు నాటు సాంగ్ అడుగుతుండేవారు. అవ‌న్నీ చూసిన‌ప్పుడు కొన్నిసార్లు క‌డుపు మండిపోతుండేది.నేనెవ‌రో, నా బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో మ‌న‌వ‌రాళ్ల‌కు చెప్పాల‌ని కొవిడ్ టైమ్‌లో డిసైడ్ అయ్యాను. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్ప‌డింది. నా గురించి నేను చిన్న పిల్ల‌లకు చెబితే ఇన్‌స‌ల్ట్‌గా ఉంటుంద‌ని ఎవ‌రూ లేని టైమ్‌లో నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్స్, మూవ్‌మెంట్స్‌ వాళ్ల‌కు చూపించాను. అవ‌న్నీ నా మ‌న‌వ‌రాళ్ల‌కు బాగా న‌చ్చాయి.

Chiranjeevi interesting comments on his grand sons and daughters
Chiranjeevi

గాడ్‌ఫాద‌ర్ సినిమాను నాలుగు సార్లు చూశారు. అందులో చిన్న పిల్లల‌కు న‌చ్చే అంశాలు ఏమున్నాయో తెలియ‌దు. నీ స్టైల్‌, యాక్టింగ్ బాగుంద‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో నేను హీరో అనే ఫీలింగ్ వ‌చ్చేసింది. ఇందుకోసం చిన్న పిల్ల‌ల ముందు సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకోవాల్సివ‌చ్చింది అని ఫ‌న్నీగా కామెంట్స్ చేశారు చిరంజీవి. చిరంజీవి కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల చిరు వాల్తేర్ వీర‌య్య‌, భోళాశంక‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. భోళా శంక‌ర్ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago