Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ఖ్యాతి గురించి,రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.వరుస సినిమాలలో నటిస్తున్న చిరంజీవి ఆ సినిమాలతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు. ఈ కాలం వారికి చిరంజీవి సత్తా గురించి ప్రత్యేకంగా తెలియకపోవచ్చు కాని ఒకప్పుడు చిరంజీవి అంటే పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు. అయితే తన గురించి తన మనవరాళ్ళకి తానే డబ్బా కొట్టుకోవల్సిన పరిస్థితి వచ్చిందని ఓ సందర్భంలో చిరంజీవి ఫన్నీగా తెలియజేశారు. శూన్యం నుండి శిఖరాగ్రాలకు పుస్తకావిష్కరణ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వయసున్న మనవరాళ్లు ఉన్నారు.
వాళ్లకు హీరోలుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్ మాత్రమే తెలుసు. వాళ్లనే హీరోలుగా ఫీలవుతుంటారు. వాళ్ల సాంగ్స్ మాత్రమే వింటుంటారు, చూస్తుంటారు. నా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఉన్నాయి. కానీ అవేవీ అడకుండా చరణ్ నాటు నాటు సాంగ్ అడుగుతుండేవారు. అవన్నీ చూసినప్పుడు కొన్నిసార్లు కడుపు మండిపోతుండేది.నేనెవరో, నా బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో మనవరాళ్లకు చెప్పాలని కొవిడ్ టైమ్‌లో డిసైడ్ అయ్యాను. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది. నా గురించి నేను చిన్న పిల్లలకు చెబితే ఇన్‌సల్ట్‌గా ఉంటుందని ఎవరూ లేని టైమ్‌లో నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్స్, మూవ్‌మెంట్స్ వాళ్లకు చూపించాను. అవన్నీ నా మనవరాళ్లకు బాగా నచ్చాయి.
గాడ్‌ఫాదర్ సినిమాను నాలుగు సార్లు చూశారు. అందులో చిన్న పిల్లలకు నచ్చే అంశాలు ఏమున్నాయో తెలియదు. నీ స్టైల్, యాక్టింగ్ బాగుందని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో నేను హీరో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇందుకోసం చిన్న పిల్లల ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది అని ఫన్నీగా కామెంట్స్ చేశారు చిరంజీవి. చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల చిరు వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భోళా శంకర్ చిత్రం దారుణంగా నిరాశపరచింది.