Vaishnav Tej : ఈ సారి ఏపీ ఎన్నికలు మరింత రంజుగా మారే అవకాశం ఉంది. కూటమినా, లేకుంటే వైసీపీనా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదే తరుణంలో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ని గెలిపించాలని కూడా చాలా మంది భావిస్తున్నారు.తనతో కలిపి 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని బరిలో దింపిన పవన్.. తన ఫ్యామిలీకి చెందిన వారిని కూడా ప్రచారంలోకి దింపుతున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రచారం సరిపోదనుకున్నారో ఏమో.. నాగబాబు కూడా అక్కడ చెమటోడుస్తున్నారు.
నాగబాబు సతీమణి కూడా మరిది కోసం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అది చాలదన్నట్టు మెగా ఫ్యామిలీ హీరోలను ఒక్కొక్కరినే రంగంలోకి దింపుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు మరో హీరో ఆయనకు జత కలిశారు. పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఆయన కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. వీరికితోడు జబర్దస్త్ టీమ్ కూడా పిఠాపురంలో హడావిడి చేస్తోంది. పిఠాపురంలో తమ్ముడి తరపున చిరంజీవి ప్రచారానికి వస్తారని అంటున్నా.. అది ఎప్పటినుంచి అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు చిరంజీవి వస్తారా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు.
మెగాస్టార్ రావాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. ఆయన వస్తేనే కాపు ఓట్లలో కాస్తయినా కదలిక వస్తుందని అనుకుంటున్నారు. వైష్ణవ్ తేజ్ ఈ రోజు మధ్యా హ్నం 3 గంటలకు పిఠాపురం నవఖండ్రవాడ నుంచి రోడ్ షో ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలం కొండెవరం, ఇసుకపల్లి మీ దుగా నాగులాపల్లి, రమణక్కపేట, రామరాఘవపురం, ముమ్మిడివారిపోడులో పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారన్నారు. అనంతరం శ్రీరాంపురం నుంచి కోనపాపపేట, శీలంవారిపాలెం మీదుగా మూలపేట సెజ్ కాలనీ చేరుకున్నారు.. అక్కడ నుంచి మూలపేట సెంటర్‌లో రోడ్డుషోలో ప్రసంగించారు. . రామన్నపాలెం, అమీనాబాద్ సెంటర్ నుంచి యండపల్లి ఎస్సీ పేట, యండపల్లి జంక్షన్,కొత్తపల్లి మీదుగా ఉప్పాడ బీచ్‌రోడ్ సెంటర్లో రోడ్‌షోలో ప్రచారం నిర్వహించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…