Indian T20 World Cup Squad 2024 : మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఒక్కో దేశం తమ ఆటగాళ్లకి సంబంధించిన లిస్ట్ విడుదల చేస్తుంది.. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. రింకూ సింగ్, కేఎల్ రాహుల్‌కు మొండిచేయి చూపడం మినహా అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎంపిక అయ్యారు. రిషభ్ పంత్ మెగాటోర్నీతో అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పంత్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, సంజు శాంసన్ మిడిలార్డర్‌లో చోటు దక్కించుకున్నారు.
జట్టులో స్థానాలకు తగ్గట్లుగా కాకుండా స్టార్ ప్లేయర్లను సెలక్ట్ చేయడంతో మిడిల్ ఆర్డర్-లోయర్ ఆర్డర్ కూర్పు గందరగోళంగా మారింది. అలాగే ఫామ్‌లో లేని మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లను ఎంపిక చేయడంతో భారత పేస్ దళం బలహీనంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో సిరాజ్, అర్షదీప్ ధారాళంగా పరుగులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో, అంతకుముందు జరిగిన అఫ్గానిస్థాన్ సిరీస్‌లో దూబె నాలుగో స్థానంలో వచ్చాడు. భారత జట్టులో అయిదో స్థానం వరకు ఖరారు అవ్వడంతో దూబె ఆరు లేదా ఏడో స్థానాల్లోనే రావల్సి ఉంటుంది. ఆ స్థానంలో పెద్దగా ఆడింది లేదు. అయితే ఫినిషర్ పాత్రలో దూబె ఎంతమేరకు రాణిస్తాడు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఆ స్థానాల్లో రింకూ సింగ్‌కు మంచి రికార్డు ఉంది. కానీ అతడు జట్టులో లేడు. ఫామ్‌లో ఉన్న దూబెను జట్టులో బలవంతంగా కొనసాగించాలని భావిస్తే భారత జట్టు కూర్పు చెడిపోతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం హార్దిక్‌కు అలవాటే. అయితే స్పిన్ ఆల్‌రౌండర్‌గా జడేజా/ అక్షర్ పటేల్‌లో ఒకరు తుది జట్టులోకి వస్తారు. దీంతో అయిదో స్థానం నుంచి ఎనిమిదో స్థానం వరకు భారత్ పంత్, దూబె, జడేజా/అక్షర్ పటేల్ వంటి ముగ్గురు ఎడమ చేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగాల్సి వస్తుంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…