మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్తా చాటుతోంది ఉపాసన. ఎంతో చలాకీగా ఉండే ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఉపాసన ద్వారా చాలా మందికి ఆరోగ్య సూచనలు చేస్తూ.. సలహాలు ఇస్తూ ఉంటుంది. అలానే మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టడం, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు గ్రామీణ వైద్య సేవలు, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం వంటివి చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది.
ఉపాసనని చాలా మంది డైమండ్ స్పూన్‌లో పుట్టిన రిచ్ కిడ్‌గానే ట్రీట్ చేస్తుంటారు. కానీ ఆ భావనే తప్పంటోంది ఉపాసన. తాము డైమండ్ స్పూన్‌తో పుట్టేందుకు పేరెంట్స్ విపరీతంగా కష్టపడ్డారని.. అలాగే చరణ్, తాను కూడా తమ పిల్లల కోసం ఆ విధంగానే హార్డ్ వర్క్ చేస్తామంటుంది. ఇక నా పుట్టుకకు ఓ కారణముందని నమ్ముతాను. గొప్ప ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉండి కూడా చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఏం చేయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ అని ఉపాసన పేర్కొంది.
తాను ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు గ్రాండ్ ఫాదర్‌తో మొదటిసారి అపోలో ఆస్పత్రికి వెళ్లానని.. హెల్త్ కేర్ రంగంలో దేశానికి సేవలు అందించాలని ఆ రోజే డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది ఉపాసన. ఈ ప్రాసెస్‌లో అనేక ప్రొఫెషన్స్ ప్రయత్నించానని తెలిపిన మెగా కోడలు.. సాధ్యమైనంత మందికి సాయం చేయాలని అనుకుంటున్న పేర్కొంది. పేదలకు ఉపాధి కల్పించాలని, ఆనందకరమైన జీవితం కోసం వారి జీవన ప్రమాణాలను పెంచాలని కోరుకుంటున్నట్లుగా ఉపాసన ఓ వీడియోలో పేర్కొంది. కష్టం విలువతో పాటు సమాజానికి తిరిగివ్వాలనే విషయాలను అర్థంచేసుకుంటూ పెరిగానని, సమాజంకి ఎంతో కొంత తిరిగి ఇస్తానని ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉపాసన వీడియోపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…