బుల్లితెర యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తుంటుంది. అలానే జంతు ప్రేమికురాలైన రష్మీ ఎవరైనా మూగ జీవాలను హింసిస్తే కోపంతో రగిలిపోతుంటుంది. కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు తన వంతుగా సాయం చేసింది. అయితే మూగ జీవాల విషయంలో రష్మీ స్పందించే తీరుపై ఎప్పుడు ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. కాని ఈ సారి మాత్రం రష్మీని ఏకి పారేస్తున్నారు. నీ వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటూ తిట్టి పోస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే.
కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు వదలడం అత్యంత విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీధి కుక్కల దాడి ఘటనపై మంత్రి కేటీఆర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ ఇది అత్యంత బాధాకరమని అన్నారు.ఇక జంతుప్రేమికురాలైన రష్మీ కూడా స్పందిస్తూ.. జరిగిన ఘటనలో బాలుడి తప్పేంలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. కుక్కల సంతాన ఉత్పత్తి, వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించాలి అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.
రష్మీ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలాంటి వాళ్లు వీధి కుక్కలని ప్రోత్సహించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఇలా కన్నుమూయడం వారికి ఎంత కడుపుకోతని మిగిలిస్తుంది. అది నువ్వు తీర్చగలవా. మళ్లీ కుక్కలకి వ్యాక్సినేషన్, సరైన వసతి కల్పించాలి అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావ్ అంటూ రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే కుక్కల వలన ఎంతో మంది చిన్నారులు కన్నుమూసారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే ఇలాంటి ఘటన జరగడం దారుణం. దీనికి నువ్వు కూడా పరోక్షంగా కారణమయ్యావు అంటూ రష్మీ గౌతమ్‌ని తిట్టి పోస్తున్నారు. రష్మికి జంతువులన్నా.. పక్షులన్నా చాలా ఇష్టం. మూగజీవాలపై ప్రేమని చూపిస్తూ.. జంతు సంక్షేమం కోసం గళం వినిపిస్తూనే ఉంటుంది. కాని వీధి కుక్కల విషయంలో ఆమె మాట్లాడుతున్న మాటలు ఎవరికి నచ్చడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…