నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చంద్రముఖి సినిమాలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత కూడా ప్రభు చాలా సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ప్రభు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా వైద్యులు చెప్పుకొచ్చారు.. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు.
ప్రభు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటున్నారు సినీ ప్రముఖులు. ప్రభు చివరిసారిగా విజయ్ దళపతి వారిసు చిత్రంలో నటించారు. ఈ ఏడాది విడుదలైన తమిళ బ్లాక్ బాస్టర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1లో కూడా ప్రభు నటించారు. ఎంతో హుషారుగా, చలాకీగా ఉండే ప్రభు ఇప్పుడు అనారోగ్యం బారిన పడడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో హీరోగా కనిపించిన ప్రభు 80,90 దశకంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం మాత్రం తెలుగ, తమిళ చిత్రాలలో సహాన నటుడి పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ తండ్రిగా నటించారు. శక్తి చిత్రంలో కూడా మెరిసారు. ఆయన కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా, చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆసుపత్రిలో యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను తొలగించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…