తెలంగాణ గాయనిగా ఇప్పుడు భారీ స్థాయిలో గుర్తింపు పొందిన సింగర్ మంగ్లీ. తన పాటలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. ఈ అమ్మడు ఏ పాట పాడిన కూడా యూట్యూబ్లో మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇప్పుడు ఆమె రెగ్యులర్ సింగర్ గా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా మంగ్లీ తానేంటో నిరూపించుకుంటుంది. అలాగే స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా ఆమె నుంచి వస్తూ ఉన్న ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ప్రతి ఫెస్టివల్‌కి మంగ్లీ ఏదో ఒక వీడియో చేస్తూ వదులుతూ ఉంటుంది.
శివరాత్రి సందర్భంగా మంగ్లీ పక్కా ఓ ఆల్బమ్ సాంగ్ చేస్తుంది.దటి నుంచి శివుడి పై పాటలు పడిన పాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు కూడా ఆమె ఒక స్పెషల్ వీడియోను షూట్ చేసి మరి రిలీజ్ చేస్తుంది. వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సింగర్ మంగ్లీ ఈసారి భంభం బోలే అంటూ శివుడి పై సరికొత్త పాటతో భక్తిని చూపించింది. ఈ పాటను ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ రచించారు. ఇక పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ పాటను శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో షూట్ చేశారు.
సాధారణంగా శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో ఎలాంటి షూటింగ్ లకు కూడా అనుమతులు ఉండవు. భక్తులు ఫోన్లు కూడా తీసుకురాకూడదు అని అక్కడ అధికారులు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. చిన్న ఫోటో తీసిన కూడా ఎవరు ఊరుకోరు. అలాంటిది మంగ్లీకి సాంగ్ షూట్ కోసం ఎలా అనుమతి ఇచ్చారంటూ ఫైర్ అవుతున్నారు. దక్షిణా కైలాసంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి మంచి గుర్తింపు ఉంది. శివరాత్రి రోజు కోసం ప్రత్యేకంగా మంగ్లీ పాడిన శివుడి పాటను అందులోనే చిత్రీకరించడం ఇప్పుడు వివాదంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…