Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ పీరియడ్ ను ఆస్వాదిస్తున్న ఉపాసన.. ‘మెటర్నిటీ స్టైల్’ కొనసాగిస్తున్నారు. నిజానికి మహిళలు ప్రెగ్నెన్సీ టైమ్‌లో తమ ప్రొఫెషనల్ లైఫ్‌కు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి వీలైనంత వరకు ప్రయాణాలు కూడా తగ్గించుకుంటారు. కానీ ఈ విషయంలో ఉపాసన మాత్రం వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇక తను తీసుకునే ఆహారం, ధరించే బట్టలల విషయంలోను ఉపాసన కొత్తగా ఆలోచిస్తుంది. అయితే సింపుల్ యాక్సెసరీస్‌తో క్లాసిక్ లుక్‌లో కనిపించే ఉపాసన.. తన ఫేవరెట్ యాక్సెసరీ గురించి తాజా ఇంటర్వ్యూలో వివరించింది.
ఎవిల్ ఐ బ్రేస్‌లెట్ (దిష్టిని తగ్గించే) లేకుండా తన స్టైలింగ్ పూర్తవదని చెప్పింది ఉపాసన. ప్రతి మహిళ ఈ బ్రాస్‌లెట్ కలిగి ఉండటం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇది ‘దిష్టి లేదా చెడు కన్ను’ నుంచి రక్షించడంలో ఎంతో సాయపడుతుందని పేర్కొంది. తన రెగ్యులర్ స్టైల్‌కు సంబంధించి ముందుగా కంఫర్ట్ చూసుకున్న తర్వాతే ఇతర విషయాల గురించి ఆలోచిస్తానంటోంది ఉపాసన. అంతేకాదు అన్నింటికంటే మించి మన వ్యక్తిత్వమే మాట్లాడాలనేది తన ఒపీనియన్ అని పేర్కొంది.
రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన జువెలరీ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఉపాసన తన లుక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.. దుస్తులను శరీరానికి తగినట్లుగా, జువెలరీని తన మూడ్‌కు అనుగుణంగా ధరిస్తానని పేర్కొంది. కశ్మీర్, స్వీడన్ నుంచి వచ్చిన వాటిని ధరించడం తనకు ఇష్టమని పేర్కొన్న మెగా కోడలు.. జోయా కలెక్షన్స్ కూడా ఇదే రకంగా ఉండటం సంతోషంగా ఉంంటుందన్నారు. కాగా, వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. రీసెంట్‌గా తిరిగొచ్చారు. అక్కడే ఉపాసన ఫ్రెండ్స్, కజిన్స్ తనకు శ్రీమంతం వేడుక నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…