Shaakuntalam : స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రం శకుంతల, దుశ్యంతుడు ప్రేమ కథగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా,ఈ చిత్రం రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి సర్వత్రా నెగిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నాయి. సాధారణంగా సమంత నటించే హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు మంచి వసూళ్లనే రాబడుతుంటాయి. టాక్ బావుంటే స్టార్ హీరోల రేంజ్ లో వసూళ్లు ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. సమంత నుంచి చివరగా వచ్చిన యశోద చిత్రం మంచి విజయం దక్కించుకుంది.
అయితే సమంత సోలో చిత్రాలు ఎప్పుడూ 50 కోట్ల మార్క్ దాటలేదు. అయితే.. గుణశేఖర్ సమంత క్రేజ్ ని నమ్ముకుని శాకుంతలం చిత్రానికి 80 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే రూ.35 కోట్ల రూపాయలకు ఈ చిత్ర ఓటీటీ ప్లాట్‌ఫామ్ రైట్స్ అమ్మేశారు. అలానే శాటిలైట్ ఛానల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దిల్ రాజు ప్రయత్నించారు. దిల్ రాజు రూ. 15 కోట్లు అడగగా, వారు చెల్లించడానికి నిరాకరించారు. దీంతో ఆ డీల్ కుదరలేదు. అయితే ఈ సినిమా భారీ లాభాలు రాబడుతుందని అందరు అనుకున్నారు.
చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా బ్యాడ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది . ఒకసారి ‘శాకుంతలం’ చిత్రం వసూలు చేసిన 4 డేస్ కలెక్షన్స్ ను కనుక గమనిస్తే..ఈ ‘శాకుంతలం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం రూ.17.5 కోట్లు అని సమాచారం తెలుస్తుంది. ఇక 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.3.92 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.13.58 కోట్ల షేర్ ను మాత్రం రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రాబట్టిది రూ.5 కోట్ల లోపే. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాతలు దిల్ రాజు- గుణశేఖర్ రూ.20 కోట్లకు పైగా నష్టపోనున్నారు. అయితే ఒక్కొక్కరు ఎంత నష్టాన్ని భరిస్తారో ఇంకా తెలియదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…