Upasana : రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కానుండడంతో అటు మెగా ఫ్యామిలీ, ఇటు కామినేని కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. త్వరలోనే తల్లిదండ్రులు కానున్న రామ్‌చరణ్ దంపతులకు చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు ఉపాసన ఫ్రెండ్స్. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్సీ మెడలో పూలదండ వేసి పలు బహమతులు కూడా అందించారు. ఈ ఫొటోలను ‘బేబీ కమింగ్ సూన్’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసుకుంది ఉపాసన.
ఉపాసన స్నేహితులు కూడా బేబీ షవర్ ఫొటోలను ట్విట్టర్లో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ అయితే తమ అభిమాన హీరోతో పాటు , ఉపాసనని చూసి తెగ మురిసిపోతున్నారు.జంట చూడ ముచ్చటగా ఉందని, వీరి బేబి కూడా చాలా క్యూట్‌గా ఉండడం ఖాయం అని మెగా అభిమానులు జోస్యాలు చెబుతున్నారు. కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే ఇటీవల ఉపాసన తాతయ్య, అపోలో సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించగా, ఈ బర్త్ డే వేడుకలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్, ఆయన కూతురు రాధే జగ్గీ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా వారితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన.ఈ సందర్భంగా సద్గురు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…