Meena : భ‌ర్త మ‌ర‌ణించిన త‌ర్వాత మీనా నుండి ఊహించ‌ని వీడియో.. షాక్ లో ఫ్యాన్స్..

Meena : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు హీరోయిన్లుగా సందడి చేసిన వారిలో మీనాకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. త‌న అందం, అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది మీనా. చైల్డ్ ఆర్టిస్టుగానే తన కెరీర్‌ను మొదలు పెట్టిన మీనా ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. అయితే, హీరోయిన్‌గా మాత్రం తెలుగులోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత సౌత్‌లో చాలా సినిమాల్లో నటించారు. దీంతో ఆమె రేంజ్ భారీగా పెరిగింది. ఫలితంగా దక్షిణాదిలోని గొప్ప హీరోయిన్ల జాబితాలోనూ మీనా చోటును పొందారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే ఆమె వివాహం చేసుకుంది.

బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ను 2009 జూలై 12న ఆర్యవైశ్య సమాజ్ మండపంలో వివాహం చేసుకున్నారు. వీళ్లకు నైనిక అనే పాప కూడా జన్మించింది. అయినప్పటికీ ఆమె కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఇలా మొదట్లో హీరోయిన్‌గా నటించిన ఆమె.. క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. దృశ్యం సినిమాతో మీనాకి మంచి పేరు వ‌చ్చింది. అయితే మీనా జీవితం సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్‌లో మరణించిన విషయం తెలిసిందే.

Meena shared her dance video after a long time
Meena

చాలా కాలంగా శ్యాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడిన ఆయన.. గత ఏడాది ఆరంభంలో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి విద్యాసాగర్ ఆరోగ్యం మరింతగా క్షిణించ‌డం, మెరుగైన వైద్యం అందించిన కూడా ఆయన కన్నుమూశారు. భర్త మరణించిన తర్వాత మీనా కాసింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే మీనా ఆ బాధ నుండి కోలుకుంటున్న‌ట్టు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న మీనా ‘రౌడీ బేబీ’ అనే తమిళ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమెతో పాటు నటి సంఘవి కూడా ఉన్నారు. ‘ఎనిమీ’ మూవీలోని సాంగ్‌కు డ్యాన్స్ చేసిన మీనా ఇప్పుడు కొంత ఆనందంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం వీడియో అయితే తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago