Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా కూడా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను పసుపుతో మనం నయం చేసుకోవచ్చు. అయితే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ తాగడం వల్ల అధిక బరువు ఇట్టే తగ్గుతారు. ఇక పసుపు టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు టీని తయారు చేసేందుకు గాను 6 టేబుల్ స్పూన్స్ పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం పొడి, అంతే మోతాదులో మిరియాల పొడి అవసరం అవుతాయి. ఇప్పుడు పసుపు టీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. దీని వల్ల ఈ పొడిని రోజూ తయారు చేయాల్సిన పని ఉండదు. ఒకసారి చేస్తే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.
ఇక ఇలా తయారు చేసిన పొడిని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. పది నిమిషాల పాటు నీటిని మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి వడకట్టాలి. అనంతరం గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ టీని తాగేయాలి. ఇలా రోజూ పరగడుపున తాగాలి. అవసరం అనుకుంటే రాత్రి పడుకునే ముందు కూడా ఒక కప్పు మోతాదులో ఈ టీని తాగవచ్చు. అయితే దీన్ని ఎప్పుడు తాగినా కనీసం 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోకూడదు.
ఇలా పసుపు టీ ని తయారు చేసి రోజూ తాగడం వల్ల పొట్ట భాగంలో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే దీంతో కరిగిపోతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. థైరాయిడ్ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతాయి. ఇలా పసుపు టీతో ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే దీన్ని గర్భవతులు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…