Aparichitudu Movie : సాధారణంగా దర్శకులు ఫలానా హీరోని ఊహించుకొని కథ రాసుకుంటారు. కాని ఆ హీరో పలు కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌కి నో చెబితే ఇదే కథని వేరే హీరోతో చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అపరిచితుడు టైటిల్ రాజశేఖర్ నుండి విక్రమ్ దగ్గరకు వెళ్లింది. అపరిచితుడు సినిమాను గుర్తు చేసుకోగానే ముందుగా మన ముందుకు వచ్చే హీరో విక్రమ్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 13 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నాడు శంకర్. అక్కడ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు.
అయితే అపరిచితుడు అనే టైటిల్ విక్రమ్ కంటే ముందు మరో హీరో కోసం వాడుకోవాలని చూసారు. దానికి దర్శకుడు శ్రీను వైట్ల. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఒకప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో అపరిచితుడు సినిమా తెరకెక్కాల్సి ఉంది. అందులో రాజశేఖర్ హీరోగా నటించాలని అనుకున్నాడు. అపరిచితుడు అనే టైటిల్ ని ముందుగా టాలీవుడ్ యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ కోసం రిజిస్టర్ చేయించారు. 1994లో దర్శకుడు శ్రీనువైట్ల రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే సినిమాని చేద్దాం అనుకున్నాడు. 20% షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.
తరువాత శ్రీనువైట్ల 1998లో “నీకోసం” అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలా రాజశేఖర్ చేయాల్సిన “అపరిచితుడు” అనే టైటిల్ తో సినిమా తీసి హిట్టు కొట్టాడు శంకర్. అంతే కాదు శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు సినిమాలు కూడా ముందుగా రాజశేఖర్ ని హీరోగా అనుకున్నవే. కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమాలు వేరే వాళ్ల చేతిలోకి వెళ్లాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…