ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఇది వచ్చిన తరువాత బాధపడడకం కన్నా రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటిస్ అయితే వంశ పారంపర్యంగా వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటిస్ అయితే పూర్తిగా మన జీవన విధానం అస్తవ్యస్తంగా ఉండడం వల్లే వస్తుంది. కనుక టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది.
ఇక డయాబెటిస్ వచ్చిన వారిలో ఆరంభంలోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని కనిపెట్టడం ద్వారా డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. దీంతో వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా ఉంటుంది. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారికి ఆరంభంలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్న వారికి దాహం ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన కూడా ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్‌ను బయటకు పంపేందుకు శరీరానికి నీరు అవసరం. అందుకే మనకు దాహం వేస్తుంది. ఇక అలా దాహం వేసినప్పుడు తాగిన నీరు గ్లూకోజ్ తో కలిసి మూత్రం రూపంలో నిరంతరం బయటకు వస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులు 4 నుంచి 10 సార్ల వరకు మూత్ర విసర్జన చేయవచ్చు. ఆ స్థాయి దాటితే దాన్ని డయాబెటిస్ గా గుర్తించాలి. ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ వచ్చిందని తెలుసుకోవాలి.
పైన చెప్పిన అధిక దాహం, మూత్ర విసర్జనతోపాటు అధికంగా ఆకలి కూడా ఉంటే దాన్ని కచ్చితంగా డయాబెటిస్‌గా నిర్దారించాల్సిందే. ఎందుకంటే శరీరంలో తయారయ్యే ఇన్సులిన్‌ను కణాలు గ్రహించలేవు. దీంతో మనం ఆహారం తిన్నప్పటికీ అది గ్లూకోజ్ మారినా కూడా రక్తంలో అలాగే ఉంటుంది. కణాలు గ్లూకోజ్‌ను వాడుకోవు. ఫలితంగా వాటికి శక్తి అవసరం అవుతుంది. దీంతో మెదడు ఆకలి సిగ్నల్‌ను పంపుతుంది. అందువల్లే ఆకలి వేస్తుంది. తిన్న వెంటనే బాగా ఆకలి వేస్తుంటే దాన్ని డయాబెటిస్‌గా గుర్తించాలి.
డయాబెటిస్ ఉన్నవారు చిన్న పని చేసినా తీవ్రంగా అలసిపోతారు. అసలు పనిపై ఏ మాత్రం శ్రద్ధ చూపించలేరు. దీనికి తోడు ఎప్పుడూ అలసిపోయి నిద్ర వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. ఈ లక్షణాలు గనక ఉంటే డయాబెటిస్ ఉందేమోనని అనుమానించాలి. వైద్యున్ని కలసి చికిత్స తీసుకోవాలి. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కళ్లు మసకగా కనిపిస్తాయి. కళ్లలో ఉండే ద్రవాల అసమతుల్యత కారణంగా ఇలా జరుగుతుంది. అయితే డయాబెటిస్ అదుపులో ఉంటే ఈ సమస్య రాదు. కానీ చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది శాశ్వత అంధత్వానికి దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్త పడాలి.
ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పాటించకపోయినా సడెన్‌గా, ఉన్నట్టుండి బరువు తగ్గుతుంటే దాన్ని డయాబెటిస్‌గా అనుమానించాలి. శరీర కణాలకు శక్తి సరిగ్గా అందదు కనుక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి చర్మం దురదగా ఉంటుంది. ఎందుకంటే ఒంట్లో ఉండే నీరు అధిక మొత్తంలో బయటకు పోతుంది. దీంతో చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా చర్మం దురదగా అనిపిస్తుంది.
డయాబెటిస్ ఉన్న వారికి గాయాలు అయితే అవి త్వరగా మానవు. ఎందుకంటే గాయాల వద్దకు రక్తం సరిగా చేరుకోదు. రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో గాయం వద్ద డ్యామేజ్ అయిన కణాలు త్వరగా రిపేర్ అవవు. ఫలితంగా గాయం మానడం ఆలస్యమవుతుంది. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. మెడ, చంకలు, గజ్జలు, మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మంపై డార్క్ ప్యాచ్‌లు ఉన్నా అనుమానించాలి. అది డయాబెటిస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
డయాబెటిస్ ఉన్న వారిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదని చెప్పాం కదా. అయితే ఈ రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం మూలాన శరరీంలో ఉండే కణాలు దీర్ఘకాలంలో దెబ్బ తింటాయి. దీంతో కణాలు దెబ్బ తిన్న చోటల్లా స్పర్శ లేకపోవడం లేదా ఆ ప్రాంతంలో సూదులతో గుచ్చినట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నా అది డయాబెటిస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక వెంటనే డాక్టర్‌ను కలిస్తే మంచిది. దీంతో చికిత్స చేసి డయాబెటిస్ ఉందీ.. లేనిదీ.. నిర్దారిస్తారు. ఫలితంగా వ్యాధి ముదరకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…