బొప్పాయి పండ్లతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. దీన్ని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో బొప్పాయి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ ఇవి మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య పోష‌కాలు ఎన్నో ఉంటాయి. విట‌మిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలో బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. బొప్పాయి పండ్ల‌ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ సంరక్షణకు బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసి వాడుకోవచ్చు.

ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులకు కూడా ఈ పండ్ల‌ను ఉపయోగించవచ్చు. చర్మంపై ఏర్పడే మృత కణాలను పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు బొప్పాయి తోడ్పడుతుంది. వయస్సు మీద పడిన వారిలోనూ ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. వారి సౌందర్యాన్ని పెంచుతుంది. శరీరంలోని, రక్తకణాలలోని కొవ్వును తీసివేయడంతోపాటు గుండెపోటు రానీయకుండా చూస్తుంది. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి తొలగిస్తుంది.

amazing health benefits of papaya

ఇది జీర్ణవ్యవస్థకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రోజూ బొప్పాయిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. మలబద్దకానికి బొప్పాయి మంచి మందు. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు నిత్యం బొప్పాయి తింటే ఫ‌లితం ఉంటుంది. విటమిన్ ఎ, సిలు బొప్పాయిలో ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు బొప్పాయిలో ఉంటాయి. జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ బొప్పాయి పండ్ల‌ను తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మహిళల్లో తలెత్తే రుతు సంబంధ సమస్యలను తొలగిస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయంలో ఉండే క్యాన్సర్ కారక క్రిములను నాశనం చేస్తుంది.

అధిక బరువు ఉన్నవారు నిత్యం బొప్పాయిని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు తక్కువ క్యాలరీలను అందజేస్తాయి. సన్నగా మారాలనే వారికి బొప్పాయి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం, వెనిగర్ కలిపి తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. పచ్చి బొప్పాయిని మెత్తని ముద్దగా చేసి దాని నుంచి రసం తీసి కొబ్బరి నూనెలో కలపాలి. ఆ నూనెను తలస్నానానికి ముందు రోజు రాస్తే ఫలితం ఉంటుంది.

బొప్పాయి, అరటి గుజ్జును సమపాళ్లలో తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో నాలుగు చుక్కల వెనిగర్, కొంత నీరు కలిపి ముఖానికి మర్దనా చేసుకుని కడిగేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇది చక్కని క్లీన్సర్‌గా పనిచేస్తుంది. చర్మం గరుకుగా ఉంటే బొప్పాయి గుజ్జును రాసి కొంత సేపటి తరువాత నీటితో త‌డిపి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. బొప్పాయి కలిపిన ముల్తానీ మట్టితో తరచూ ప్యాక్ లా వేసుకోవడం వల్ల ముడతల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు రావు. యవ్వ‌నంగా క‌నిపిస్తారు.

Share
editor

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago