Actors : సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఒక్క అవకాశం వచ్చిన సరే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉబలాటపడుతుంటారు.ఈ క్రమంలో విలన్ పాత్రలు అయిన సరే, చిన్న చిన్న క్యారెక్టర్స్ అయిన సరే ఓకే చెప్పేస్తారు. అయితే మొదట విలన్ గా నటించి ఆ తరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు మాత్రం అతితక్కువ మంది ఉంటారు. ఇలా టాలీవుడ్ లో అలా కొంతమంది హీరోలు మొదట విలన్ పాత్రలు వేసి ఆ తర్వాత హీరోలుగా మెప్పిస్తున్నారు.
ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే ఆయన ఇది కథ కాదు, మెసగాడు సహా మరికొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆ తరవాత చిరు టాలెంట్ చూసి హీరో అవకాశాలు ఇస్తే ప్రస్తుతం మెగాస్టార్‌గా ఇండస్ట్రీనే ఏలే స్థాయికి ఎదిగాడు. ఆయన ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ దున్నేస్తున్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఇక డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్వర్గం నరకం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మోహన్ బాబు కూడా కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ విలన్ గా రాణించని ఆ తరవాత హీరోగా అవకాశాలు రావడం, మంచి హిట్స్ సాధించడంతో కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు. ఇటీవల సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు.
ఇక మ్యాచో హీరో గోపిచంద్ తొలివలపు సినిమాలో హీరోగా నటించగా, ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ అవ్వలేదు. కానీ జయం సినిమాలో విలన్ గా నటించి మెప్పించి, ఆ తరవాత హీరోగానూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. హీరో రాజశేఖర్ కూడా కెరీర్ మొదట్లో తలంబ్రాలు సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాలో తన నటనకు నంది అవార్డును సైతం దక్కింది.. ఆ తరవాత హీరోగా మంచి సినిమాలు చేయగా, అవి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఇక జేడీ చక్రవర్తి కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. కానీ ఆ తరవాత హీరోగా విలన్ గానూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి మాత్రం పెద్దగా సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…