Shiva Krishna On Rana Naidu : విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇందులోని కంటెంట్ కొంత మందికి మాత్రం చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. రిలీజ్‌కి ముందు ట్రైలర్ చూసి ఇది తండ్రి, కొడుకుల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ లా సీరియస్ గా ఉండే సిరీస్ అని అందరు భావించారు. కానీ రిలీజ్ తర్వాత ఈ సిరీస్ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి.
వెంకటేష్ ఫ్యామిలీ హీరో కావడంతో ఆయన సినిమాల మాదిరిగానే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని చాలా మంది ఈ సిరీస్ ను చూశారు. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో బూతులు, బోల్డ్ కంటెంట్ ఉంటుందని తెలిసిందే కానీ తెలుగు హీరోలని తీసుకొని ఈ రేంజ్ లో అడల్ట్ కంటెంట్ పెట్టి తీయడంతో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు శివకృష్ణ దీనిపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో సెన్సార్ బోర్డు సభ్యుడుగా పనిచేసిన ఈయన తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ పై మండిపడుతూ.. ఓటీటీ కంటెంట్ కి కూడా సెన్సార్ ఉండాలని తెలిపారు.
ఓ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు అది వెబ్ సిరీస్ లా అనిపించలేదు. అది ఆల్మోస్ట్ బ్లూ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో అంత దారుణమైన కంటెంట్ చూడలేదు. అందులో కొన్ని సీన్స్ అయితే మరీ దారుణం.గా ఉన్నాయి. భార్య, భర్తలు బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు పిల్లలు చూడటమేంటి. దేశం ఆర్ధికంగా పతనమైనా కోలుకుంటుంది. కానీ సంసృతి పరంగా పతనమైతే అస్సలు కోలుకోలేదు. సినిమాల్లో బూతులు, అడల్ట్ కంటెంట్ ఉంటే థియేటర్స్ కి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. అదే వెబ్ సిరీస్ లు అలా కాదు. ఇంట్లో అందరూ చూసేవి. ఈ మధ్య సిరీస్ లలో అందరూ ఇలాంటి కంటెంట్ ఎక్కువగా పెడుతున్నారు అంటూ రానా నాయుడిని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు శివకృష్ణ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…