Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్న సమంత, నాగ చైతన్య ఊహించని విధంగా 2021 అక్టోబర్ 2న తమ విడాకులు ప్రకటించారు. ఈ విషయం అక్కినేని అభిమానులతో పాటు సమంత అభిమానులని కూడా చాలా బాధించింది. అయితే వీరు విడిపోయి చాలా రోజులే అవుతున్నా కూడా ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. వారు తిరిగి కలుస్తున్నారని కొందరు, జీవితంలో ఒకరి మొఖం ఒకరు చూడకుండా ఉండాలని భావిస్తున్నారని మరి కొందరు ఇలా ఎవరికి వారు తమకు నచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు.
నాలుగేండ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరు బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. చాలా మందికి ఆదర్శ జంటగానూ ఉన్న వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మారింది. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేసింది. ఈ విషయంలో చైతూ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందనే టాక్ వినిపించింది. అయిన ఇద్దరు ఎందుకు విడిపోవల్సి వచ్చిందనేది ఎవరికి అర్ధం కాలేదు. స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒకే నోట్‌ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థాలకు పిల్లలు కనడం, ఎక్స్ పోజింగ్, ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని, పైగా `పుష్ప`లో ఐటెమ్ సాంగ్ చేయడం కూడా నాగ్ ఫ్యామిలీకి నచ్చలేదని ప్రచారాలు జరిగాయి. ఇక ఇదే క్రమంలో ఓవర్సీస్ క్రిటిక్‌గా చెలామణి అవుతున్న ఉమైర్ సంధు ఓ ట్వీట్ చేసి సమంత మనోగతం ఇదే అని పేర్కొన్నడు. నాగచైతన్య, ఆయన కుటుంబం సాంప్రదాయ వాదులు. నేను వీరితో ఉండటం ఓ పంజరంలో బంధించినట్టుగా ఉంది. బోల్డ్ సినిమాలు చేయోద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, నైట్ పార్టీలకు వెళ్లొద్దు, ఐటెమ్ నెంబర్లు చేయోద్దు.. వంటి కండీషన్లతో బతకడం నా వల్ల కాలేదు. అసలు నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం` అని సమంత భావిస్తున్నట్టు ఉమైర్ సంధు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…