Natu Natu Song : ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాట ఇక ఆస్కార్ దక్కించుకున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది. ప్రతి ఒక్కరు ఈ పాటకి కాలు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హర్భజన్-రైనా కలిసి ఈ పాటకి గ్రౌండ్‌లో స్టెప్పులు వేయగా, ఇక రీసెంట్‌గా విరాట్ కోహ్లీ కూడా కాలు కదిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఫీల్డింగ్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. నాటు నాటు స్టెప్పులేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది.
ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. దీనికి ట్రిపుల్ ఆర్ టీమ్ స్పందించింది. విరాట్ కోహ్లీ ట్యాగ్ చేస్తూ లవ్ ఎమోజీలతో రీట్వీట్ చేసింది. ట్విటర్‌లో కాపీరైట్ కారణంగా ఈ వీడియో డిలీట్ అవ్వగా.. ఇన్‌స్టాలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ పంచుకుంది. కోహ్లీ నాటు నాటు స్టెప్పులకు సంబంధించిన వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి షారుక్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పఠాన్’ పాటకు స్టెప్పులు వేసి అలరించాడు విరాట్ కోహ్లీ.
ట్రెండింగ్ సాంగ్స్‌కు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడం గతంలోను చూశాం. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని చెప్పాలి. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ గతేడాది విడుదలై అఖండ విజయం సాధించింది. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘ఆస్కార్’ అవార్డు అందుకోగా, ఈ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ట్రిపుల్ ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…