Ram Charan : తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు పొందడం అంత ఆషామాషీ కాదు. ముఖ్యంగా చిరంజీవి తనయుడిగా ఆయన క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తన తండ్రి ఉప్పొంగిపోయేలా, గర్వపడేలా చేస్తున్నాడు చరణ్. ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్ అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లిలో లాండ్ అయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ తన తండ్రి మెగాస్టార్ చిరుతో కలిసి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆ సమయంలో చిరంజీవి కళ్లలో పుత్రోత్సాహాం కనిపించింది. అటు కేంద్ర హోం మంత్రితో పాటు ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో పాటు అక్కడ పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్టార్ సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. తను విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు. కుదిరితే కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక తనకు తండ్రి చిరంజీవి.. ఎడమ కన్ను అయితే.. బాబాయి పవన్ కళ్యాణ్ కుడి కన్ను అంటూ పేర్కొన్నారు. అటు తండ్రి, బాబాయిల తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అంటూ స్టన్నింగ్ సమాధానమిచ్చారు. ఇక నాకు తారక్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే జక్కన్న మా ఇద్దరినీ సెలెక్ట్ చేశారు. ఆయన కాకపోయి ఉంటే మేమిద్దరం కలిసి నటించే వాళ్లమే కాదన్నారు. 92 ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ స్థాయికి వెళ్లిన సినిమానే లేదు. నామినేషన్ వరకు వెళ్లి ఉండొచ్చు కానీ.. ఈ స్థాయి అప్లాజ్ వచ్చింది మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకే అంటూ సంతోషం వ్యక్తం చేశారు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా జరిగినన్ని రోజులు మాకు స్వీట్ టార్చర్ పెట్టారు జక్కన్న. దాని వల్లనే ప్రపంచ వేదికలతో పాటు మీ ముందు ఇలా ఉన్నానని చెర్రీ స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…